-యూబీఐ డిప్యూటీ రీజనల్ హెడ్ హరీష్ బేతా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న పరీక్షల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో నిర్వహించిన పరీక్షా పే చర్చ – 2025 కార్యక్రమం ప్రత్యక్ష ప్రసార ప్రదర్శనను సోమవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) విజయవాడ ప్రాంతీయ కార్యాలయం విజయవాడ, ప్రసాదంపాడులోని వివేకానంద ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి భారతదేశంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో సంభాషించారు. పరీక్షలకు ముందు ఒత్తిడిని అధిగమించడానికి వారికి ప్రేరణాత్మక చిట్కాలను అందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిమితంగా ఉపయోగించడం, వాతావరణ మార్పులపై అవగాహన మరియు నాయకత్వ లక్షణాలపై కూడా ప్రధానమంత్రి విద్యార్థులకు సూచనలిచ్చారు. పీఎం సంభాషణ తర్వాత వివేకానంద ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి యూబీఐ డిప్యూటీ రీజనల్ హెడ్ హరీష్ బేతా మాట్లాడుతూ విద్యార్థులందరూ తమ కెరీర్‌లో గౌరవ ప్రధాని సలహాలను పాటించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రోత్సహించారు. విద్యార్థులు కూడా చిన్నతనం నుంచే పొదుపు అలవాటు, ఆర్థిక క్రమశిక్షణను అలవవరచుకోవాలన్నారు.
Prajavartha Online Telugu News