Breaking News

తూర్పు తెదేపా కార్యాలయంలో గద్దె క్రాంతి జన్మదిన వేడుకలు

-తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ కేకు కటింగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నాడు టిడిపి నాయకులు గద్దె క్రాంతికుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ పార్లమెంట్ తెలుగు యువత నాయకులు షేక్ నాగూర్ తెచ్చిన 37 కేజీల భారీ కేకును తెలుగు యువత శ్రేణులతో కలిసి గద్దె క్రాంతి కేక్ కటింగ్ చేసి యువతకు తినిపించారు. అనంతరం పెద్ద క్రాంతికుమార్ కు గజమాలను తెలుగుయువత శ్రేణులు వేశారు. పెద్ద ఎత్తున విద్యార్థిలు, తెలుగు యువత నాయకులు, టి.ఎన్.టి.యు.సి ఆటో కార్మిక సంఘాలవారు, టిడిపి శ్రేణులు, జనసేన శ్రేణులు పాల్గొని గద్దె క్రాంతి కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గద్దె హేమన్స్, షేక్ నాగూర్, పులిపాటి రాజు, పెనుగొండ శ్రీనివాస్, పడమట సతీష్ చంద్ర, రాయవరపు అశోక్, తోట శ్రీనివాస్, షేక్ హనీఫ్, నందిపాటి దినేష్ గాంధీ, జగరపు బాలు, కర్రి రాజేష్, కాసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *