Breaking News

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి అవసరమైన సూచనలు, సలహాలు స్వీకరించటానికి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి నెల సమావేశం నిర్వహించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డా. తాతా సేవాకుమార్, బహుజన సమాజ్ పార్టీ నుంచి చిరతనగండ్ల వాసు, భారతీయ జనతా పార్టీ నుంచి పద్మనాభరావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బిళ్లా సునీల్ కుమార్, తెలుగు దేశం పార్టీ నుంచి కంచర్ల శివరామయ్య, జనసేన పార్టీ నుంచి సీహెచ్ త్రినాధ్ రావు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాలు రూపొందించటాన్ని మరింతగా మెరుగుపర్చాలన్న ఉద్దేశ్యంతో జిల్లా ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి నెల సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జిల్లాలో ప్రతి నెల మొదటి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించటం జరుగుతుందన్నారు. సమావేశంలో రాజకీయ పార్టీలు తెలిపిన అంశాలు, సూచనలు, సలహాలను జిల్లా స్థాయిలో పరిష్కరించే వాటిని వెంటనే పరిష్కరించటం జరుగుతుందని, రాష్ట్ర స్థాయిలోను, పాలసీలకు సంబంధించిన అంశాలు, సలహాలపై చర్యల కోసం ఎన్నికల సంఘానికి పంపించటం జరుగుతుందన్నారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలిపిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ ఓటరు కార్డులకు డోర్ నెంబర్లు సక్రమంగా ఉండేలా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న ఎస్ఎస్ఆర్ కు ముందుగానే పైలైట్ గా పట్టణాల్లో ఒక పోలింగ్ బూత్ లో ఓటర్లు డోర్ టూ డోర్ వెరిఫికేషన్ చేసి ఒకే కుటుంబ సభ్యులు ఓకే పోలింగ్ బూత్ లో ఉండేలా పరిశీలన చేయాలన్నారు. ఓటరు కార్డు ఆధార్ కార్డుకు అనుసంధానం అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఓటరు జాబితాలో చనిపోయిన వారి ఓట్లు, డబల్ ఎంట్రీ ఓట్లు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం బీఎల్వోలు తొలగింపుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. బీఎల్వోలకు పూర్తి స్థాయిలో శిక్షణలు అందించి, క్షేత్ర స్థాయిలో సక్రమంగా విధులు నిర్వహించేలా ఈఆర్వోలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశంలో తెలిపిన అన్ని అంశాలను మినిట్స్ రూపంలో నమోదు చేసి వాటికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజా వలి, ఈఆర్వోలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, లక్ష్మీ కుమారి, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి, ఏఈఆర్వోలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *