Breaking News

ప్రధాన మంత్రి  ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంత్ దాస్ కి సాదర వీడ్కోలు

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం ఉదయం తిరుగుపయనమైన భారత ప్రధాన మంత్రి  ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంత్ దాస్ కి రేణిగుంట విమానాశ్రయం నందు సాదర వీడ్కోలు పలికిన తిరుపతి జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్, జాయింట్ కలెక్టర్ శుభమ్ బన్సల్. ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి  ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంత దాస్ గారికి జిల్లా కలెక్టర్ గారు ఎంతో ప్రసిద్ధి గాంచిన ఏర్పేడు మండలం మాధవమాల ఉడ్ కార్వింగ్ ఆర్టిజాన్ క్లస్టర్ నందు తయారు చేయబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమ జ్ఞాపికను, అలాగే శ్రీకాళహస్తి కలంకారి క్లస్టర్ నందు తయారు చేయబడిన కలంకారి క్యాన్వాస్ ను అందించారు. ఉత్తమ హ్యాండీ క్రాఫ్ట్ ఉడ్ కార్వింగ్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రపంచ పర్యాటక దినోత్సవం – 2024 సందర్భంగా తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మాధవమాల హ్యాండీ క్రాఫ్ట్ ఉడ్ కార్వింగ్ ఎంపిక కాబడి ఆం.ప్ర ముఖ్యమంత్రి  చేతుల మీదుగా అవార్డు పొందడం జరిగిందని, అలాగే జిల్లాలోని శ్రీకాళహస్తి కలంకారి క్లస్టర్ వాటి ప్రాశస్త్యాన్ని కలెక్టర్ వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *