Breaking News

సమగ్ర నివేదికను అందచేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సీనియర్ సిటిజన్ యాక్ట్- తూర్పు గోదావరి జిల్లా-కొవ్వూరు డివిజన్ -దేవరపల్లి మండలంయాదవోలు గ్రామము నకు చెందిన కోలా వరలక్ష్మి , భర్త: కృష్ణమూర్తి వారి ద్వారా తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ ట్రిబ్యునల్ నందు నమోదు కాబడిన కేసు విషయమై శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ లో ఆర్డీవో రాణి సుస్మిత, ఫిర్యాదు దారుని సమక్షంలో కేసు విషయమై కోర్టు నిర్వహించడం జరిగింది. ఇందుకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులు అమలు పై సమగ్ర నివేదిక ఆధారంగా విచారణ చేపట్టడం జరిగిందన్నారు. తల్లితండ్రులను వృద్ధాప్య దశలో చూడకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని ఆరోపణలను అనుసరించి ఇద్దరు పిల్లలు ప్రతి నెల ఐదు వేలు చెరో రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని ఆదేశించడం జరిగింది. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను అందచేయాలని ఆర్డీవో ప్రాధమిక ట్రిబ్యునల్ అధికారి రాణి సుస్మిత ను కలెక్టర్ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *