-నగరంలోని పలు పరీక్షా కేంద్రాల తనిఖీ
-జేసి పర్యవేక్షణలో ఎస్బిఐ స్ట్రాంగ్ రూమ్ నుంచి ప్రశ్న పత్రాలు పరీక్షా కేంద్రాలకు తరలింపు
-2,690 మంది విద్యార్థులు హజరు, 70 మంది గైర్హాజరు
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో 2,760 మంది విద్యార్థులు నీట్ పరీక్షలు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందనీ, అందులో 2,690 విద్యార్థులు పరీక్షలకి హాజరు కావడం జరిగిందనీ , 70 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.
ఆదివారం రాజమహేంద్రవరం పరిధిలో ఓ ఎన్ జీ సీ బేస్ కాంప్లేక్స్ , ఆర్ట్స్ కళాశాల పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, అక్కడ విధుల్లో ఉన్న అధికారులకి, ఇన్విజిలేటర్స్ , ఇతర సమన్వయ అధికారులకి పలు సూచనలను చెయ్యడం జరిగింది. జిల్లాలోని 8 పరీక్షా కేంద్రాల్లో నీట్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోనీ 8 పరీక్ష కేంద్రాలు: రాజమండ్రి కేంద్రీయ విద్యాలయ ONGC బేస్ కాంప్లెక్స్ 360 కి 355 , రాజానగరం మండలం పరిథిలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆదికవి నన్నయ యూనివర్సిటీ 480 కి 463 , యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ 240 కి 230 , ఎస్కేవిటీ ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల 240 కి 233 , దానవాయిపేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల 240 కి 231 , ఎస్కేవిటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 480 కి 474 , రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల 480 కి 470, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల 240 కి 234 మంది హాజరయ్యారు.
జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పర్యవేక్షణ లో స్థానిక కంబాల చెరువు ఎస్బిఐ బ్రాంచి నుంచి ప్రశ్న, జాబు పత్రాలను అత్యంత భద్రత మధ్య ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించడం జరిగింది
Prajavartha Online Telugu News