Breaking News

ఇదీ నారా వారి అభివృద్ధి చరిత్ర…

-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత

కడప, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పది నెలల కాలంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని సీఎం చంద్రబాబునాయుడు చేపట్టారని, ఇదీ నారా వారి అభివృద్ధి చరిత్ర అని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. కడపలో మహానాడులో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సవిత మాట్లాడారు. ఫ్యాక్షనిజంతో అట్టుడికిపోతున్న కడపలో అభివృద్ధి చేపట్టారని, రాయలసీమను సస్యశ్యామల చేశారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేస్తూ, ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీ మేరకు పెన్షన్లు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కేవలం పది నెలల కాలంలో రాష్ట్రంలో ఎన్నడూ జరగలేనంత అభివృద్ధిని సీఎం చంద్రబాబు చేసి చూపించారని, నారా వారి చరిత్ర సత్తా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు.

జగన్ వి పిచ్చి కూతలు
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక జగన్ రెడ్డి పిచ్చి కూతలు కూస్తున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీని మూసిసే సమయం వచ్చిందని, చివరికి కడపలో కూడా తన పని అయిపోయిందనే విషయం జగన్ రెడ్డికి అర్థమైందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా జగన్ రెడ్డీ..? అని మంత్రి సవిత నిలదీశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుపాను హెచ్చరికలు, భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి

-ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి -అవసరం ఉన్న చోట పునరావాస శిబిరాల నిర్వహణలో పాలుపంచుకోవాలి -పంచాయతీరాజ్, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *