Breaking News

శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మినీ కళ్యాణ కట్ట ను ప్రారంభించిన డిప్యూటీ ఈ ఓ .శాంతి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీనివాసమంగాపురంలోని… శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు భక్తుల సౌకర్యార్థం. ..
“కళ్యాణకట్ట ఏర్పాటు చేయడం చాలా సంతోషమని శ్రీవారి భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సోమవారం మినీ కల్యాణకట్టను ఆలయ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక భక్తురాలితో పూజ చేయించారు. అనంతరం డిప్యూటీ ఈవో శాంతి మాట్లాడుతూ శ్రీనివాస మంగాపురం లోని కళ్యాణకట్ట ఏర్పాటు చేయడం చాలా సంతోషమని ఇందుకు సహకరించిన చంద్రగిరి నియోజక వర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం డిప్యూటీ ఈవో శాంతి చేతులమీదుగా రిబ్బన్ కట్ చేసి తలనీలాల కేంద్రాన్ని ప్రారంభించారు. తిరుమలకు వెళ్ళలేని భక్తులు శ్రీనివాస మంగాపురం వచ్చి ఆలయంలోని కల్యాణమండపం పక్కన మినీ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి దైవ దర్శనం చేసుకోవచ్చని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించేందుకు అనువుగా ఉంటుంది. తలనీలాలు సమర్పించే భక్తుల కోసం ఇక్కడ స్నానపు గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ ధనంజయుడు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయలు‌, అర్చకస్వాములు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *