గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న రోజుల్లో 10 కోట్లు మందిని లాక్ పతి దిదిలుగా మార్చుటకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
ప్రతి ఏడాది లక్ష రూపాయల ఆదాయం కనీసం రావాలని, ప్రస్తుతం రెండు, మూడు కోట్లుగా ఉన్న లాక్ పతి దిదిల సంఖ్య పెంచుటకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వాటర్ షెడ్ మహోత్సవ్ పై రెండు రోజుల జాతీయ సదస్సు రెండవ రోజు గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో మంగళవారం జరిగింది. ఈ జాతీయ సదస్సులో కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య వ్యక్తిగా వచ్చానని, రైతు సేవకుడిగా వచ్చానని, వారి సేవ దైవ సేవగా భావిస్తానని అన్నారు. నారా చంద్ర బాబు నాయుడు గొప్ప ముందు చూపు గల వ్యక్తి అని, పవన్ కళ్యాణ్ దృష్టి, నరేంద్ర మోడీ ఆలోచనా విధానం వలన ఈ ముగ్గురి ఆలోచనా విధానం గొప్ప సమ్మేళనంగా ఉందన్నారు.
వెంగళాయపాలెం వంటి చెరువుకు దేశంలో ఇతర ప్రాంతాల్లో చేపడతామని చెప్పారు. రానున్న రోజుల్లో 10 కోట్లు మందిని లాక్ పతి దిదిగా చేయాలని ప్రయత్నం జరుగుతుందని అన్నారు.
మహిళా స్వావలంబనకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన క్రింద ప్రతి ఒక్కరూ పక్కా గృహం కలిగి ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకు జిల్లా కలెక్టర్, శాసన సభ్యులు సర్వే నిర్వహించి ఏ ఒక్కరు గుడిసెల్లో ఉండకుండా చూడాలని సూచించారు. వివిధ కార్యక్రమాల క్రింద ఉత్పాదన పెంచే విధానం ఉందని, అందరూ మూడు పంటలు వేసుకునే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. చిన్న సన్నకారు రైతుకు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంచి చర్యలు చేపడుతోందని, ఇతర పంటలపై దృష్టి మార్చే విధంగా అవగాహన కల్పించడం మంచి విషయం అన్నారు. అటువంటి పంటల ఉత్పాదకాలను ఎగుమతులు చేయుటకు సహకారం అందిస్తామని అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మీ శివరాజ్ సింగ్ చౌహాన్ మామ అండగా ఉంటారని చెప్పారు. పెమ్మసాని చంద్ర శేఖర్ హిందీ, హిందీ ప్రాంత వాసులను ఆలోచింపజేసే విధంగా ఉందని ప్రశంసించారు.
కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ మాట్లాడుతూ పల్లెలు దేశ ప్రగతికి పట్టుగొమ్మలన్నారు. 25 శాతం వర్షంపై ఆధారపడి ఉన్నాయి, వీటి కోసం ప్రధాన మంత్రి వాటర్ షెడ్ కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచించారు. ఇటువంటి మంచి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్రం ఒక భాగం కావాలని ఆలోచించారని చెప్పారు. ఈ పథకాలు బాగా అమలుచేసి ఆదర్శంగా నిలవాలని రాష్ట్రానికి తీసుకువస్తున్నామని తెలిపారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ కు 40 శాతం యూరియా సరఫరా చేశారని తెలిపారు. రాష్ట్ర
సమస్యల పట్ల మంత్రి పరిష్కారం ఇచ్చారని తెలిపారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు 180 కోట్ల రూపాయలు విడుదల చేశారని చెప్పారు. వెంగళాయపాలెం చెరువు మంచి నిర్వహణకు ఆలోచించి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కొబ్బరి మొక్కలు నాటామని, చేపలు, బాతులు
పెంచి ఆదాయ వనరులు సమకూర్చడం జరుగుతోందని తెలిపారు. దేశంలో 5 వేలు కంటే ఎక్కువ జనాభా కలిగిన 20 నుండి 25 వేల గ్రామాలు ఉన్నాయని, అటువంటి ప్రాంతాల్లో నీటి వనరులు పెంపుదలకు చర్యలు చేపట్టడం జరుగుతోందని వివరించారు. తద్వారా
ఆరోగ్యం, ఆహ్లాదం కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి ఆలోచనా విధానంతో అనేక ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి చేపట్టడం జరిగిందన్నారు.
జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నీటిని ఒడిసి పట్టుకోకపోతే అనేక రకాలుగా నష్టపోతామన్నారు. ప్రధాన మంత్రి చక్కటి కార్యక్రమం అమలు చేస్తున్నారని చెప్పారు. భూగర్భజలాలు పెంచుకోవాలి… భూసారాన్ని పరిరక్షించుకోవాలి.. పంటలను సాగు చేసుకోవాలన్నారు. నీటిని వృథా చేయరాదన్నారు. ప్రధాన మంత్రి,
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయుటకు కృషి చేస్తున్నారని, మనం భాగస్వామ్యం కావాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ భూ వనరుల విభాగం
కార్యదర్శి మనోజ్ జోషి మాట్లాడుతూ దేశంలో తక్కువ ఫలసాయం ఇస్తున్న 50 లక్షల హెక్టార్ల భూమిని ఒకసారి నుండి ఎక్కువ సార్లు పంటలు వేసుకునే విధంగా మార్చడం జరిగిందన్నారు. పంట ఉత్పాదక ఆరు రెట్లు పెరిగి, రూ.20 వేల కోట్ల ఆదాయం లభించిందన్నారు. రైతు ఆదాయం 70 శాతం పెరిగిందన్నారు. భూగర్భ జలాలు మూడు మీటర్లు వరకు పెరిగిందన్నారు. చెరువులను పునరుద్ధరించడం జరుగుతోందని, నదీ ప్రాంతాలు కూడా పునరుద్ధరించుటకు చర్యలు చేపట్టడం జరుగుతోందని వివరించారు.
ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో భాగమైన వివిధ సంఘాలకు చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, శాసన సభ్యులు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ టి. క్రిస్టినా,
కేంద్ర ప్రభుత్వ భూ వనరుల విభాగం
కార్యదర్శి మనోజ్ జోషి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం శశిభూషణ్ కుమార్, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జాయింట్ సెక్రెటరీ నితిన్ కడే, రాష్ట్ర పంచాయతీ రాజ్ సంచాలకులు మైలవరపు కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, గ్రామీణ అభివృద్ధి శాఖ వాటర్ షెడ్ విభాగం సంచాలకులు వై.వి.కె. షణ్ముఖ కుమార్, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News