
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రిటైర్డ్ APSRTCఉద్యోగులు, వారి జీవిత భాగస్వామ్యుల వైద్య సేవల సౌకర్యార్ధం ఈ రోజు ఉదయం హైదరాబాదు తార్నాక రోడ్డు నం.1 లో, వైద్యశాలను ఆర్టీసీ యం.డీ. శ్రీ సి.హెచ్. తిరుమల రావు, IPS, ప్రారంభించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం, APSRTC తన ఉద్యోగుల భాగస్వామ్యంతో 2017లో విజయవాడ విధ్యాధరాపురంలో సెంట్రల్ హాస్పిటలను ఏర్పాటు చేసుకుంది. అయితే, ఎపీఎస్ ఆర్టీసీ లో పనిచేసి, రిటైర్ అయి, హైదరాబాదు లో సెటిల్ అయిన సుమారు 2000 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ తార్నాక హాస్పిటల్ లో వైద్య సేవలు లబించేవి కావు. దాంతో వారు తప్పనిసరి పరి పరిస్థితులలో విజయవాడకు రావలసి వచ్చేది. హైదరాబాద్ లో వైద్యశాలను ఏర్పాటు చేయమని రిటైర్డ్ ఉద్యోగులు ఏంతో కాలంగా కోరుతున్నారు. వారి అభ్యర్ధనను సానుకూలంగా పరిశీలించి, వారి వ్యయ ప్రయాసలను పరిగణలోకి తీసుకుని, ఈ డిస్పెన్సరీని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ రోజు ప్రారభించడం జరిగింది.
కాగా, ఈ హాస్పిటల్ పూర్తి స్థాయిలో పనిచేసేందుకు సరిపడా సీనియరు వైద్యాధికారిని, సీనియరు పార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బందినీ, వైద్య పరికర సామాగ్రినీ ఇప్పటికే బదలాయించారు. ఈ డిస్పెన్సరీ ద్వారా రిటైర్డ్ ఉద్యోగులు, వారి జీవిత భాగాస్వామ్యులకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందజేస్తారు.
అంతేకాక, ఆంద్రప్రదేశ్ జిల్లాలనుంచి ప్రతిరోజూ హైదరాబాదుకు వచ్చే సుమారు 2000 డ్రైవర్లు, కండక్టర్ సిబ్బందికి కూడా అవసర, అత్యవసర సమయాలలో కావలసిన వైద్యసదుపాయాలు ఈ హాస్పిటల్ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేసారు. వైద్యపరంగా అవసరమయితే ఇతర స్పెషాలిటి హాస్పిటలస్కు కూడా రిఫర్ చేసే నిర్ణయం ఇక్కడి వైద్య అధికారి తీసుకుంటారు.
అలాగే, హైదరాబాదులోని వివిధ ప్రాంతాలలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, రద్దీ, తదితర వ్యవహారాలను పర్యవేక్షించే నిమిత్తం ఉద్యోగరీత్యా బస్సు భవన్, కూకట్ పల్లి, బీహెచ్ఈఎల్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ వైద్యశాల సేవలు ఏంతో ఉపకరిస్తాయి.
ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎడ్మిన్) శ్రీ ఏ. కోటేశ్వర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసరు శ్రీ అప్పారావు, ఫైనాన్షియల్ అడ్వైజరు శ్రీ రాఘవరెడ్డిలతో పాటు అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు హాజరయ్యారు.
ఈ హాస్పిటల్ ఏర్పాటుపట్ల రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు, విధి నిర్వహణలో రోజూ హైదరాబాదుకు వచ్చే బస్సు సిబ్బంది కూడా హర్షం వ్యక్తం చేస్తూ, ఆర్టీసీ యమ్.డి. ద్వారక తిరుమల రావుకు కృతజ్ఞతలు తెలియపరిచారు.
Prajavartha Online Telugu News