-సెంట్రల్ నియోజకవర్గ రహదారులు, వంతెనల నిర్మాణంపై సుధీర్ఘ చర్చ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి పూర్తి సహాయ సహకరాలు అందించాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖామాత్యులు మాలగుండ్ల శంకరనారాయణ ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. విజయవాడ-నూజివీడు ప్రధాన రహదారి పున: ప్రారంభం నేపథ్యంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంత్రి శంకరనారాయణతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రధాన రహదారులు, వంతెనల నిర్మాణంపై సుధీర్ఘంగా చర్చించారు. అయోధ్యనగర్ నుంచి పైపుల రోడ్డు వరకు ప్రధాన రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. గుణదల ఆర్వోబీ స్టేజ్ 1 పనులు పూర్తి చేసుకుని.. స్టేజ్ 2 పనులకు టెండర్లను పిలవాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా నందమూరి నగర్ వాసులకు ఇళ్ల పట్టాలని ఇవ్వాలని కోరగా మంత్రివర్యులు సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రస్తావించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి.. పనులు త్వరితగతిన చేపట్టేలా చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News