Breaking News

ఘన వ్యర్ధాల నిర్వహణ సక్రమంగా చేయాలి…

-రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకూడదు : జేసీ ఎల్. శివశంకర్.

గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణ , గ్రామీణ ప్రాంతాలలో ఘన వ్యర్ధాల నిర్వహణ సక్రమంగా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అధికారులను ఆదేశించారు. గుడ్లవల్లేరు లో శనివారం ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాన్ని అధికారులతో కలిసి జేసీ సందర్శించారు. కేంద్రంలో తడిచెత్త, పొడిచెత్త కలిసి సేకరించడం జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ శివశంకర్ మాట్లాడుతూ పట్టణ , గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికీ, షాపులకు వెళ్లి తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా సేకరించాలన్నారు. సేకరించిన చెత్తను ఎప్పటికప్పుడు కంపోస్ట్ యార్డ్ కు తరలించాలన్నారు. పట్టణ , గ్రామీణ ప్రాంతాలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చెత్త సేకరణకు చర్యలు తీసుకోవాలి. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకూడదని, రోడ్లు , ఇళ్ల పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా గ్రీన్ అంబాసిడర్లు, పంచాయత్ సెక్రటరీలను జేసీ ఆదేశించారు. పొడి చెత్తలో రీసైక్లింగ్ అనువైన చెత్తను పర్యావరణ హితమైన విధానంలో ఘన వ్యర్ధాల నిర్వహణ జరగాలని అధికారులను జేసీ ఆదేశించారు. తడి చెత్తను వార్మ్ కంపోస్ట్ యార్డ్ కి తరలించి, సేంద్రియ ఎరువుగా రూపొందేంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయానికి రైతులు మొగ్గు చూపుతున్నారని, సేంద్రియ ఎరువును రైతులకు కేజీ 10 రూపాయల చొప్పున అందిస్తే పంచాయతీకి ఆదాయం కూడా వస్తుందన్నారు.

గ్రామ సచివాలయం పరిశీలించిన జేసీ : గుడ్లవల్లేరు గ్రామంలోని గ్రామ సచివాలయం-1 ను ఈ సందర్భంగా జేసీ శివశంకర్ పరిశీలించారు. ప్రజలకు అందుతున్న సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ అర్హులైన పేదలందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ పధకాల సమాచారంతో రూపొందించిన పోస్టర్లు, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులు, అనర్హుల జాబితాలను గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించాలని జేసీ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. జెసి వెంట ఇంచార్జి డివిజినల్ పంచాయత్ అధికారి, ఎంపిడిఓ కె. మణికుమారి, తహసీల్దార్ ఆంజనేయులు, ఈవోపీఆర్డీ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *