Breaking News

ప్రపంచ మేధావి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌… : నాగిపోగు కోటేశ్వరరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ 131వ జయంతి వేడుకలు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రతినిధి రాష్ట్ర అధ్యక్షులు నాగిపోగు కోటేశ్వరరావు పలు ప్రాంతాలలో ఘనంగా నిర్వహించి పాల్గొని అంబేద్కర్‌ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాగిపోగు కోటేశ్వరరావు మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, భారత రాజ్యాంగ నిర్మాతగా సంఘ సంస్కర్తగా ప్రజాస్వామ్య పరిరక్షకునిగా మహామేధావి అయిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహోన్నత వ్యక్తి అని ఆయన కొనియాడారు. అంబేద్కర్‌ జయంతి సందర్బంగా స్వీట్స్‌ పళ్ళు కొరకు వేమండ గ్రామ యువకులకు కొంత ఆర్థిక సహాయం చేయగా వారు ఆయనను ఘనంగా సన్మానించారు. ఉంగుటూరు మండలం వేమండ గ్రామంలోని ఎంపిపి స్కూల్లో యానివర్సిలీ ఫంక్షన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలకు ప్రసంసాపత్రాలు అందించారు. నాగిపోగు కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ తమ పిల్లల్ని తప్పకుండా చవించాలని చదువుకున్న అంబేద్కర్‌ని స్పూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు విద్యా కమిటీ చైర్మన్‌ సునీల్‌, కోపరేట్‌ బ్యాంక్‌ అధ్యక్షులు శనగవరపు సాంబశివరావు, గ్రామ ఉప సర్పంచ్‌ నరిశెట్టి శ్రీనివాసరావు, గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *