Breaking News

ప్రత్యక్ష దైవానికి ప్రతీకైన తల్లికి వందనం…

-జిల్లా కలెక్టర్ఎస్.ఢిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

బాల్యదశ నుండి పిల్లలకు సంస్కారాన్ని సుగుణాలను, సౌశీల్యాన్ని బోధించే ప్రథమగురువు ప్రత్యక్ష దైవానికి స్వరూపమైన తల్లి కి పాదాభివందనాలు అంటూ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాతృ మూర్తులకుశుభాకాంక్షలు అందజేసారు. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ యస్ ఢిల్లీరావు ఆయన క్యాంప్ కార్యలయంలో మాతృ మూర్తులను ఘనంగా సత్కరించి పాదాభివందనం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ సృష్టిలో అమ్మ స్థానం నిరూపమానం అని అన్నారు. మాతృ మూర్తులు బిడ్డల భాగ్య నిర్ణేతలు. దైవం అన్ని చోట్ల ఉండ లేక తనకు బదులుగా అమ్మను సృష్టించడాని లోకోక్తి. అందుకే ‘మాత్రుదేవోభవ ‘ అనే పథానికి వేదంలో అగ్ర తాంబూలం అన్నారు. ప్రతి బిడ్డకు “అమ్మ వడి ప్రధమ బడి ‘ అని ఎవరి జీవితానికి అయిన దిక్సూచి అని అన్నారు. బాధ్యత యుతమైన తల్లిగా తన దర్మాన్ని నిర్వర్తిస్తూ స్ కన్న బిడ్డల బంగారు భవిష్యత్తుకు అహర్నిశం పాటు పడే తల్లికి ఎంత చేసినా ఋణం తీర్చుకోలేమని అన్నారు. ప్రతి ఒక్కరూ కన్న తల్లిని ఆప్యాయత అనుాగాల తో ఆదరించి కంటికి రెప్పలా చూచుకుంటూ మాతృ మూర్తిని ఎల్లప్పుడు ఆనందంగా ఉంచలని కోరారు. మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నగరానికి చెందిన పెద్ది కుసుమ కుమారి, బి. హైమవతి తదితరులకు నూతన వస్త్రాలు దుశ్శాలువాతో సత్క చ్రించి పూలతో పాదాభివందనం చేసారు. ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.ఉమాదేవి, చైల్డ్ లైన్-1098 జిల్లా కోఆర్డినేటర్ అరవ.రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *