Breaking News

వార్డ్ సచివాలయాలను సందర్శన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) మరియు సచివలయాల స్పెషల్ ఆఫీసర్  కె.వి సత్యవతి గురువారం సర్కిల్ -3 పరిధిలోని 2వ డివిజన్ పరిధిలోని కార్మిక నగర్, మాచవరం నందలి 24, 35 మరియు 6వ డివిజన్ పరిధిలోని బ్రహ్మానందరెడ్డి నగర్ లోని 32, 33 మరియు 34వ వార్డ్ సచివాలయాలను సందర్శించారు. ఆయా సచివాలయాలలో విధులు నిర్వహించు సిబ్బంది యొక్క పనితీరు మరియు ప్రజలు అందించు సేవలు మరియు సమస్యల అర్జీలపై తీసుకొనుచున్న చర్యలపై సిబ్బందిని వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇస్తూ, విధి నిర్వహణలో భాద్యతగా పని చేయాలని నిర్దేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అన్నారు. అదే విధంగా జగనన్న గృహ లబ్దిదారుల విషయమై అడ్మిన్, ఎమినిటి సెక్రెటరీ, వెల్ఫేర్ సెక్రెటరీలు చేపట్టిన చర్యలను అడిగితెలుసుకొని, లే అవుట్ లలోని లబ్దిదారులు వెంటనే గృహ నిర్మాణం చేపట్టు విధంగా అవగాహన కల్పించి లబ్దిదారులు గృహములు నిర్మించుకోనునట్లు చూడవలెనని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *