Breaking News

బోధన వైద్య కళాశాల పి ఈ బి స్ట్రక్చర్ పనులను తనిఖీ చేసాము

-ముఖ్యమంత్రి ఆదేశాలతో మెడికల్ కాలేజీ పనులపై క్షేత్ర స్థాయి లో పర్యటించడం జరిగింది
-మెడికల్ ఎడ్యుకేషన్ సంచాలకులు డా. రాఘవేంద్ర రావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో బోధనా ఆసుపత్రుల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని, ఇందు కోసం పెద్ద మొత్తం లో నిధులను మంజూరు చేయడం జరిగిందని మెడికల్ ఎడ్యుకేషన్ సంచాలకులు డా. రాఘవేంద్ర రావు పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో నిర్మాణంలో ఉన్న భోధనా వైద్య కళాశాల “మేక్ షిఫ్ట్ – పిఈబి” పనుల పురోగతిని శనివారం సమీక్షించారు పఈ సందర్భంగా సంచాలకులు డా. రాఘవేంద్రరావు మాట్లాడుతూ రాజమహేంద్రవరం లోని జిల్లా ప్రధాన ఆస్పత్రి ని పూర్తి స్థాయి సర్వజన ఆసుపత్రి గా అభివృద్ధి చేసి మెరుగైన వైద్యం అందించడం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే ఆసుపత్రి ప్రాంగణంలో రూ. 475 కోట్లతో 150 మంది వైద్య విద్యార్థుల కోసం బోధనా వైద్య కళాశాల, ఆసుపత్రి నిర్మాణం పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులకు, మేఘా కన్స్ట్రక్షన్ కంపెనీ వారికి నిర్ణీత సమయం లోగా చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. రాబోయేనవంబర్ / డిసెంబర్ మాసాల్లో జాతీయ మెడికల్ కౌన్సిల్ టీచింగ్ మెడికల్ కాలేజి పనులను పరిశీలించేందుకు అధికారిక పర్యటన చేయునున్న నేపథ్యంలో అంతకు ముందే పనులను పూర్తి చేయాల్సి ఉందన్నారు. అందులో భాగంగా మేక్ షిఫ్ట్ తరహాలో మెడికల్ కాలేజీ పనులను జాతీయ మెడికల్ కౌన్సిల్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. భవన నిర్మాణ మ్యాప్ ను , ప్రి- ఇంజనీరింగ్ భవనం లో ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలను అధికారులు వివరించారు. టీచింగ్ స్టాఫ్ క్వార్టర్స్, మెడికో హాస్టల్స్, నర్స్ హాస్టల్స్ లను ప్రధాన ఆసుపత్రికి అనుసంధానంగా తదితర భవన నిర్మాణ పనులు కూడా చేపట్టడం జరుగుతుందని ఇంజనీరింగ్ అధికారులు డా. రాఘవేంద్ర రావు కు వివరించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ పి. అశోక్ కుమార్, ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ (మెడికల్) కే. విజయ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఈ ఈ ఎస్. కృష్ణా రావు డి సి హెచ్ ఎస్ డా. సనత్ కుమారి, ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితులున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *