Breaking News

అధిక ధరలకు అమ్మకాలు జరిపిన సంబంధిత షాపులపై కేసులు నమోదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధిక ధరలకు తిను బండారాలు, శీతల పానీయాలు, బిస్కెట్, చిప్స్ ప్యాకెట్స్, మజ్జిగ, పెరుగు ప్యాకెట్స్ లను అమ్మకాలు జరిపిన సంబంధిత షాపులపై కేసులు నమోదు చేయడంతోపాటు సీజ్ చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ రీజినల్ ఆఫీసర్ టి.కనకరాజు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని శ్రీ కనకదుర్గమ్మ గుడి, ఇంద్రకీలాద్ర, విజయవాడ, కొండపల్లి ఖిల్లా, ఇబ్రహీంపట్నం ఏరియా లోని పలు దుకాణాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించి అధిక ధరలకు వస్తువులను విక్ర యించిన దుకాణ నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ టి.కనకరాజు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *