కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి నదికి వరదలు ప్రమాద స్థాయి మించి ప్రవహించే అవకాశం ఉందన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు మద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ బి. నాగరాజు నాయక్ తెలిపారు. కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లి బాబు సూచనలు మేరకు పల్లిపాలెం కు చెందిన 33 మంది మత్స్య కారులను పునరావాస కేంద్రానికి గురువారం సాయంత్రం తరలించడం జరిగిందన్నారు. వారికి రాత్రి భోజన ఏర్పాటు చేసినట్లు, దుప్పట్లు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచామని తెలిపారు.
Prajavartha Online Telugu News