
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ నొవోటెల్ హోటల్ లో శాఖహరి పౌష్టిక ఆహారం…ఆహారంతో ఆరోగ్యం అనే థీమ్ తోపౌష్టిక్ కుకింగ్ కాంపిటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంపిటేషన్ నిర్వహకులు cowe india జాయింట్ సెక్రటరీ దర్శి అపర్ణ మాట్లాడుతూ హాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ చెఫ్స్ అసోసియేషన్ అనుబంధంతో నిర్వహించిన ఈ కాంపిటేషన్ లో మన రుచులు మన ఆరోగ్యం అనే సూక్తి తో ఆరోగ్యకరమైన శాఖాహర వంటకాలతో కూడా మంచి మేలైన సమాజం తయారుచేయవచ్చని ఆమె అన్నారు. అనంతరం cowe ap chapter ప్రెసిడెంట్ రాధికా చౌదరి మాట్లాడుతూ ఈ పోటీలలో పాల్గొనడానికి నగరంలో నుంచే కాకుండా ఇతర ప్రాంతాల్లో నుంచి కూడా మహిళలు చాలా ఉత్సాహంగా వారందరూ ఈ కాంపిటేషన్ లో వారి పాక నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి వారి ఇంట్లో నుంచే విభిన్న రకాల రుచికరమైన శాఖాహార వంటకాలను వండి తీసుకువచ్చి ప్రదర్శించారు. ఈ పోటీలలో ప్రదర్శించిన వంటకాలలో ఉత్తమైననవి నిర్ణయించి విజేతలుగా ప్రకటించడానికి న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ పాకశాస్త్ర నిపుణులైన ఈటివి రాజు, వనితా టివి యాదగిరి, చెఫ్ నితిన్ లు ఉండి వారు నిర్ణయించిన మొదటి, రెండవ విజేతలకు ఆకర్షణీయమైన బహుమతుల అందజేయడం జరిగిందనీ అంతేకాకుండా ఈ కాంపిటేషన్ లో పాల్గొన్న వారందరికి ఆప్రాన్ మరియు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన రోటరీ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రభు , సెక్రటరీ బాబు, cowe ap chapter సెక్రటరిలు విజయలక్ష్మీ, మోహినీ, ట్రెజరర్ శ్రావణి మరియు పలు వ్యాపార వాణిజ్య మహిళావేత్తలూ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని ఇంట్లో వండిన పలురకాల శాఖాహార వంటకా లను రుచులు చూపించి విజేతలుగా నిలిచారు.
Prajavartha Online Telugu News