Breaking News

స్పందన కార్యక్రమం లో 27 ఫిర్యాదులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమం లో నగరపాలక సంస్థ పరిధిలో 27 ఫిర్యాదులు అందాయని నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ సాంబశివరావు తెలియచేశారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సాంబశివరావు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిబ్బంది అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ వారం ప్రజల నుంచి 27 ఫిర్యాదులు అందాయని తెలిపారు. వార్డు వాలంటీర్ డోర్ టు డోర్ వెళ్లి ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు చూపేలా పనితీరు ఉండాలన్నారు. స్పందన కార్యక్రమం లో ఎస్సీ పాండురంగారావు, ఇంజనీరింగ్ ఇతర అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *