Breaking News

రైతుల సంక్షేమం, అభ్యున్నతి కోసం వ్యవసాయ శాఖ పరపతి సంఘాలు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రైతుల సంక్షేమం, అభ్యున్నతి కోసం వ్యవసాయ శాఖ పరపతి సంఘాలు పనిచేయాలని రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు డా.తానేటి వనిత, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం దొమ్మేరు వ్యవ సాయ శాఖ పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణస్వీకారంలో కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథులుగా హాజర య్యారు. రాజానగరం ఎమ్మెల్యే, జక్కంపూడి రాజా చేతుల మీదుగా నూతనంగా ఏర్పడిన కమిటీ చైర్ పర్సన్ మధునూరి నాగరాజు, బాబీ చేత ప్రమాణ స్వీకరణ చేయించారు. ఈ సందర్బంగా మంత్రి వనిత మాట్లాడుతూ వ్యవసాయ పరపతి సంఘాలు రుణాలు ఇవ్వడం కట్టించుకోవడమే కాకుండా ఆదాయం వనరుల ను పెంచుకునే విధంగా ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిం చాలన్నారు. దొమ్మేరు వ్యవసాయ శాఖ సహకార పరపతి సంఘానికి విశిష్టమైన స్థానం ఉందని ఇప్పుడున్న ఉన్నతమైన స్థానానికి మించి ఇంకా అభివృద్ధి చెందాలని రైతులకు మరిన్ని సౌకర్యాలు అందించా లన్నారు. ఈ సందర్బంగా రాజా మాట్లాడుతూ దొమ్మేరు వ్యవసాయ శాఖ పరపతి సంఘానికి చైర్ పర్సన్ గా ఎన్నికైన మదునూరి నాగ రాజు రైతులకు అండగా ఉండాలని, తనకు లభించిన బాధ్య తను సక్రమంగా నిర్వహించే ప్రభు త్వానికి మంచి పేరు ప్రఖ్యాత లు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలోఎ. యం. సీ. ఛైర్మెన్, వి. గంగాధర శ్రీనివాస్, జెడ్పి వైస్ చైర్మన్ శ్రీలేఖ, పిడి డ్వామా,యం. పి. డి . ఓ పి. జగదాంబ, కోడూరి శివరామ కృష్ణ తులసి వరప్రసాద్, బండి పట్టాభి రామారావు, చాగల్లు ఎంపీపీ మట్ట వీరాస్వామి, తాళ్ళపూడి సర్పంచ్, జొన్నకూటి పోసిరాజు,సుంకర సత్య నారాయణ,తది తర నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *