Breaking News

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కార్నియా కలెక్షన్ కేంద్రాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కార్నియా కలెక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్ మరియు ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ బి.వి.ఎస్. కుమార్ ఒక ప్రకటనలో తెలియజేసారు. రాష్ట్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొదటి కార్నియా కలెక్షన్ సెంటర్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మాన్యశ్రీ బిశ్వ భూషణ్ హరి చందన ఈ నెల 15న ఏలూరులో మొదటి కార్నియా కలెక్షన్ సెంటర్ ను ప్రారంబిస్తున్నారని అయన తెలిపారు. మన రాష్ట్రంలో దాదాపు 7 లక్షల మంది కార్నియా సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. చనిపోయిన వ్యక్తి నుండి 9 గంటల లోగా కార్నియా సేకరణ మరియు కార్నియా ను మార్పిడి చేయడం ద్వారా ఇటువంటి సమస్యలు పరిష్కరించబడతాయన్నారు. 1 నుండి 90 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల నుండి కార్నియా సేకరించవచ్చునన్నారు. మన రాష్ట్రంలో దాదాపు 21 నేత్ర బ్యాంకులు మరియు 40 కార్నియా సేకరణ కేంద్రాలు ఉన్నాయి, ఎక్కువగా NGOలు, స్వచ్ఛంద సంస్థలు మరియు సేవా సంస్థలచే నిర్వహించబడుతున్నాయని, కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్నియా సేకరణ మరియు మార్పిడి సౌకర్యాలు కూడా ఉన్నాయి. కంటి బ్యాంకులలో నిల్వ మరియు మార్పిడి సౌకర్యాలు కూడా ఉన్నాయన్నారు. కార్నియా సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించడం, దృష్టిని పునరుద్దరించే అవకాశాలు మరియు నేత్ర దానం యొక్క ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఎంతో అవసరం అన్నారు. బాధ్యతాయుతమైన పౌరులు తమ కుటుంబ సభ్యుల మరణాన్ని సమాజంలోని కార్నియా సేకరణ కేంద్రానికి తెలియజేసి కార్నియాను దానం చేయడానికి అంగీకరించాలన్నారు. సేకరించిన కార్నియా జత ఇద్దరి వ్యక్తులకు దృష్టిని కల్పిస్తుందని, ఇది మానవాళికి గొప్ప సేవ చేయడం అవుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్ మరియు ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ బి.వి.ఎస్. కుమార్ ఒక ప్రకటనలో తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *