రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్. విజయ ప్రతాప్ రెడ్డి, సభ్యులు జే. కృష్ణ కిరణ్ లు డిసెంబర్ 8, 9 తేదీలలో తూర్పు గోదావరి జిల్లా పర్యటన నిమిత్తం రానున్నట్లు జిల్లా పౌర సరఫరా అధికారి పి. ప్రసాదరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటన లో భాగంగా డిసెంబర్ 8 వ రాత్రి రాజమహేంద్రవరం చేరుకుని రాత్రి బస చేస్తారు. 9వ తేదీ శుక్రవారం ఉదయం జిల్లాలో క్షేత్ర స్థాయి తనిఖీ లో భాగంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (చౌక ధరల దుకాణాలను), మొబైల్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలు, స్కూల్స్ లో మధ్యాహ్న భోజన పథకం అమలు, పిఎంఎంవివై (Pradhan Mantri Matru Vandana Yojana), ఇతర సంక్షేమ పథకాలు అమలు తీరును , ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ల వసతి గృహల నిర్వహణ ను పరిశీలించడం జరుగుతుంది. పర్యటన లో జిల్లాలో పిల్లలు, విద్యార్థులు, పాలిచ్చే తల్లులు మరియు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరామితికి సంబంధించి అమలు జరుగుతున్న ప్రాజెక్టులను శుక్రవారం మధ్యాహ్నం వరకు క్షేత్ర స్థాయి లో సమన్వయ శాఖల అధికారులతో కలిసి పర్యటించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం మ. 3 గంటలకు సమన్వయ శాఖల జిల్లా అధికారులతో చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
Prajavartha Online Telugu News