Breaking News

పౌష్టికాహర లోపం నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి

-రక్త హీనత, పోష్టికాహరలోపం గల వారిని గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపట్టాలి
-యుక్తవయస్సు ఉన్న గర్భిణీ స్త్రీ ల గుర్తింపు పై మరింత దృష్టి కేంద్రీకరించాలి
-హౌసింగ్ లే-అవుట్ లలో నిర్మాణాలు వేగవంతం చేయాలి :
-ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి
-బడి బయటి పిల్లలందరినీ బడిలో చేర్చేలా చర్యలు చేపట్టాలి
-పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్ శాతం  తగ్గించాలి
-వారంలోపు కాన్పు జరగబోయే మహిళల రక్షిత కాన్పుపై చర్యలు చేపట్టాలి
-ఇండ్ల నిర్మాణాల స్టేజ్ కన్వర్షన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయాల ద్వారా అందచేసే పౌర సేవలు శాతం పెరగాలి, స్పందన వినతులు సకాలంలో పరిష్కరించాలని, హౌసింగ్ లే-అవుట్ లలో నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం వెలగపూడి సచివాలయం, అమరావతి నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, వివిధ శాఖల శాఖాదికారులు కోనా శశిధర్, సిద్ధార్థ జైన్, సంబందిత కమీషనర్లు, కార్యదర్శులతో కలసి అన్నిజిల్లాల కలెక్టర్లతో, జాయింట్ కలెక్టర్ లతో వర్చువల్ విధానంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్ , ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ రక్తహీనత, పౌష్టికాహర లోపం ఉన్న మహిళలు, గర్భిణీలు, పిల్లలను గుర్తించడం కోసం క్షేత్ర స్థాయి లో సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. వచ్చే గురువారం నాటికి గణాంకాలతో కూడి సమగ్ర నివేదికను అందచేయాలని ఆదేశించారు. ఆ దిశలో చైతన్యం ప్రజల్లో కల్పించే విధంగా కలెక్టరేట్, వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రారంభించాలని అన్నారు . ఆరోగ్య పరమైన అంశాలు ప్రాతిపదికన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలులో అనీమియా, ప్రసూతి మరణాలు లేకుండా చూడాలని సి ఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఉన్నతాధికారులు చేసిన సూచనల మేరకు మాట్లాడుతూ స్పందన ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలని 24,48, 72 గంటల లోగా పరిష్కారం చేసే వాటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి అర్జీ కి అర్థవంతంగా పరిష్కారం చూపించి సంబందిత అర్జీదారునితో క్షేత్ర స్థాయి ఫోటో యాప్ లో అప్ లోడ్ చేయవలసినదిగా తెలిపారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళ పథకంలో భాగంగా జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలను స్టేజ్ వారీగా కన్వర్షన్ లో పురోగతి ఉండేలా వేగవంతం చేయాలని తెలిపారు. గతవారం 1237 ఇళ్లు స్టేజ్ కన్వర్షన్ చేయగలిగాం, వీటిని 2400 కి పెంచుకోవాలన్నారు. హౌసింగ్ లే-అవుట్ లలో అన్ని మౌలిక వసతులు, విద్యుత్, ఇంటింటికీ త్రాగునీరు వసతి కల్పించి నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద 5300 ఇళ్ల నిర్మాణం పూర్తి అయినట్లు తెలిపారు. వాటికి చెందిన జియో ట్యాగింగ్, మంజూరు, రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని ఈ నెల 21 వ తేదీలోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని అన్నారు. ఆప్షన్- 3 ఇళ్లకు ఎస్.హెచ్.జి. ల ద్వారా బ్యాంకు రుణాలు అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్ లు, సంబందిత అధికారులు ప్రతి శనివారం హౌసింగ్ డే గా అన్ని మండలాలలో కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక సమీక్ష, క్షేత్ర స్థాయి సందర్శన చెయ్యడం జరుగుతుంది అని తెలిపారు..

చెత్త నుండి సంపద కేంద్రాల నిర్మాణాలు ఇంకా ప్రారంభం కానివి ఉంటె వాటిని ప్రారంభించి నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. ఇంటింటి నుండి చెత్త సేకరించి సంపద కేంద్రాలకు రవాణా చేయడం, వాటి ట్రీట్ మెంట్ మరియు డిస్పోసల్ అంతటినీ సరైన రీతిలో అమలు అయ్యేలా పర్యవేక్షించాలని వాటి వివరాలను జే.ఎస్.ఎస్. యాప్ నందు అప్ లోడ్ చేయాలని సూచించారు. జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష లో భాగంగా రీ సర్వే వేగవంతం చేయాలని ఫిబ్రవరి 2023 నాటికి 2 వేల గ్రామాలు పూర్తి స్థాయిలో గ్రౌండ్ ట్రూథింగ్, 9(2) నోటీసులు, 13 నోటిఫికేషన్ జరిగేలా చర్యలు చేపట్టాలని సిద్ధార్థ జైన్ తెలిపిన నేపథ్యంలో తగు చర్యల చేపట్టడం జరుగుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి సలహాదారు సమీర్ శర్మ సూచించిన మేరకు ఆరోగ్య పరంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా వాలంటీర్ లు, ఆశా వర్కర్లు, ఏ.ఎన్.ఎం లు ప్రత్యేక శ్రద్ద వహించి నిర్దేశిత ఎనిమిది సూచికలు, నాలుగు పారా మీటర్ల వారిగా గర్భిణులు, పిల్లల్లో రక్త హీనత , పోషకాహార లోపం లేకుండా ప్రత్యెక చర్యలు తీసుకోవాలని తెలిపారు. గర్భిణులకు, బాలింతలకు, కౌమార దశ అమ్మాయిలకు అనీమియా తగ్గించుట, పౌష్టికాహారం, జగనన్న గోరు ముద్ద,  ఐరన్ మాత్రలు అందేలా వైద్య మరియు  మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యా, సంక్షేమ శాఖల అధికారులు చర్యలు తీసుకొని పురోగతి చూపించాలని ఆదేశించారు. స్కూల్స్ లో గణాంకాలు మేరకు విద్యార్థుల నమోదు, బడి బయట పిల్లలు సంఖ్య సమీక్షించుకొని బడి మానేసిన పిల్లలను బడిలో చేర్పించే దిశగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమేరకు ఇంటింటి డేటా ఆధారంగా సచివాలయ ఎడ్యుకేషన్ ఎమినిటి సెక్రటరీలు, వాలంటీర్లు పర్యవేక్షించి కన్సిస్టెంట్ రిథం యాప్ లో నమోదు చేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సూచించిన మేరకు హాస్పిటల్ డెలివరీ లను ప్రోత్సహించి మాతా శిశు మరణాలు తగ్గించే దిశలో జిల్లాలో ముఖ్యంగా వారంలోపు కాన్పు అయ్యే మహిళల జాబితా సిద్ధం చేసుకొని వారికి మాతా శిశు మరణాలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ, మునిసిపల్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనీమియా పరీక్షలు జిల్లా కలెక్టరేట్ తో, ఇతర ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి నిర్వహించెలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమతుల్యమైన ఆహారం పై పిల్లలు, తల్లులు విద్యార్థులకు అవగాహన కల్పించి అనీమియా బారిన పడకుండా తల్లులు, పిల్లలను కాపాడాల్సిన బాద్యత ఉందని మనపై ఉందని మాధవీలత పేర్కొన్నారు. ఈ అంశంపై వచ్చేవారం సమీక్ష ఉంటుందని ఆరోగ్య పరంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సూచికలపై దృష్టి పెట్టి పురోగతి సాధించాలని అన్నారు. వయస్సుల వారీగా ఆరోగ్య సూచికలు మేరకు ఆరోగ్య స్థితిగతులు అంచనా వేసి వాటి నియంత్రణ కోసం కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని పేర్కొన్నారు..

ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. జీ నరసింహులు , ఏ డి లక్ష్మణరావు, సిపిఓ ప్రకాష్ రావు, డిపిఓ జగదాంబ, హౌసింగ్ అధికారి తారాచంద్ , ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *