Breaking News

‘మీ భూమి-మా హామీ’

– భూ యజమానికి పూర్తి భరోసా
– జగనన్న భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ భరత్

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రైతాంగానికి భూ రక్షణ భరోసాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పిస్తూ చేపట్టినదే ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం’ అని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ వివరించారు. శనివారం ఉదయం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలోని బొమ్మూరు సచివాలయం-1 ప్రాంగణంలో ‘ జగనన్న భూ హక్కు పత్రాలను’ ఎంపీ భరత్, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ భరత్ మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి ముందు నుండి అంటే సుమారు వంద సంవత్సరాల తరువాత గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వ్యవసాయ గ్రామ కంఠం‌ స్థిరాస్తుల సర్వేను సీఎం జగన్ ఒక మహాయజ్ఞంలా నిర్వహించడం ఎంతో గొప్ప విషయమన్నారు. దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ, పారదర్శకంగా నిష్పక్షపాతంగా అవినీతికి తావులేని రీతిలో ఈ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు.‌ దేశంలోనే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలోనే కార్స్ టెక్నాలజీ వినియోగంతో అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను సచ్ఛీకరణ, వాస్తవంగా ఉన్న భూమి విస్తీర్ణం ప్రకారం రికార్డుల తయారు చేయడం జరుగుతోందన్నారు. ఈ పథకం‌తో భూ యజమానులు తమ భూములపై వేరొకరు సవాల్ చేయడానికి వీలులేని శాశ్వత హామీ, భూ వివాదాలు తగ్గుముఖం పడతాయని ఎంపీ పేర్కొన్నారు. ‌ఈ పథకంపై రైతులకు గ్రామ సచివాలయ సిబ్బంది అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. ‌రాజమండ్రి రూరల్ పరిధిలో ఈ కార్యక్రమం రాజవోలు జరిగిందని, ఇప్పుడు బొమ్మూరులో రైతులకు భూహక్కు పత్రాల పంపిణీ జరుగుతోందన్నారు. బొమ్మూరు గ్రామంలో 178 మంది రైతులకు ఈ భూహక్కు పత్రాలు పంపిణీ చేయబోతున్నట్లు ఎంపీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు చిన్నారావు, ఎంపీడీవో రత్నకుమారి, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, వైసీపీ నేతలు సోమన శ్రీను, అను, రాజేష్, రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *