Breaking News

2023-24 నాబార్డు వార్షిక రుణ ప్రణాళిక రూ.10,898.93 కోట్లు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా కి చెందిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో నాబార్డు (జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్) ద్వారా ఆధ్వర్యంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు, పరిశ్రమ, విద్యా తదితర రంగాల కోసం రూ.10,898. 93 కోట్ల మేర రుణ వార్షిక ప్రణాళికను రూపొందించామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ వార్షిక ప్రణాళిక లో వ్యవసాయ సంబంధిత అనుబంధ మౌలిక రంగాలకు రూ.6,649.55 కోట్లు కాగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సా హకానికి గాను రూ.1962.49 కోట్లు, విద్య రంగానికి రూ. 70.81 కోట్లు మేర కేటాయిస్తూ ప్రతిపాదించడం జరిగిందని కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించి పొటెన్షియల్ లో ఉన్న విభాగాలకు వార్షిక ప్రణాళికలో సోషల్ ఇన్ఫ్రా కు రూ.10.30 కోట్లు, ఇన్ఫ్రా డెలివరీ కి రూ.948.25 కోట్లు, హౌసింగ్ కి రూ.581.90 కోట్లు ఎక్స్పర్ట్స్ కోసం రూ.132 కోట్లు మేర కేటాయింపులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. బ్యాంకులు తదితర రంగాలలో రుణాల కల్పనకు అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఏ జీ ఏం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులు నాబార్డు ఏ జి ఎం వైఎస్ నాయుడు, ఎల్ డి ఎం జీ. దిలీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

బేబీ కిట్లకు ఏ టారూ. 51.15 కోట్ల మంజూరు

-2.45 లక్షల మంది శిశువులకు ఉపయోగం -ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువుల కోసం -ఒక్కొక్క కిట్టు ధర రూ. 1,400.22 -మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *