Breaking News

గుడ్ గవర్నెన్స్ పై సమగ్రంగా అధ్యయనం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించే సేవలు వాస్తవంగా వారికి చేరుతున్నాయో లేదో తెలుసుకునే ప్రయత్నం లో గుడ్ గవర్నెన్స్ పై సమగ్రంగా అధ్యయనం చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ లో శుక్రవారం  జిల్లా స్థాయిలో  సుపరిపాలన వ్యాప్తి పై చేపడుతున్న చర్యలు, వాటిలో మెరుగైన ఫలితాలు పై గుడ్ గవర్నెన్స్ వారోత్సవాల కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రజల వద్దకే సు పరిపాలన అందించే ప్రయత్నం లో రాష్ట్రములో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకుని వొచ్చి ప్రజల వద్దకు ప్రభుత్వ పథకాలు అందించేలా చుడాల్సి ఉందన్నారు.  స్పందన లో ప్రతి వారం సగటున 200 ఫిర్యాదులు వస్తున్నయని , ఇందుకు కారణం క్షేత్ర స్థాయి లో ప్రజలకు అందించే సేవలలో లోపాలు కూడా ఒక కారణం కావచ్చు అన్నారు. మండల, గ్రామ స్థాయి లో ప్రతి రెండు వేల జనాభాకు, 50-75 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నా ఇంకా అర్జీలు వస్తున్నాయి అంటే లోపాలు గుర్తించి, వాటిని రాకుండా చూడాల్సి ఉంటుందన్నారు. ప్రతీ రోజు ప్రజా సమస్యలపై అవగాహన అవసరం అన్నారు.

విద్యా శాఖ పరంగా అమలు చేస్తున్న నాడు నేడు పనులు ద్వారా స్కూల్స్ తరగతి గదులు, కాంపౌండ్ వాల్ లు, టాయ్ లేట్స్ పనులు సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. అమ్మఒడి , విద్యా కానుక, వంటి ఎన్నో రకాల సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవడం జరిగిందని, వాటి ఫలాలు అర్హులకు చేరవేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అంగన్ వాడి స్కూల్ నుంచి పిల్లలకు ఫౌండేషన్ కోర్సులు అంగన్వాడీ ఆయాలు ద్వారా నేర్పించి, బోధన పద్ధతులను పట్టిష్టం చెయ్యడం జరుగుతుందన్నారు. వైద్య పరంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని, మాతృ, శిశు మరణాలను గణనీయంగా తగ్గించడం చెయ్యగలిగితే ఆరోగ్య పరంగా చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుందన్నారు.

సుపరిపాలన వారోత్సవాలు స్ఫూర్తి తో భవిష్యత్ ప్రణాళిక ప్రకారం అడుగులు వేయడం ద్వారా వచ్చే ఏడాది నిర్వహించుకునే సుపరిపాలన వారోత్సవాలు నాటికి నూటికి నూరు శాతం ఫలితాలు సాధించగలమన్న భరోసా ప్రజల్లో కలుగ చెయ్యడం మన ముందు ఉన్న లక్ష్యం అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు మాట్లాడుతూ, డిసెంబర్ 19 నుంచి 25 వరకు సు పరిపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా గత మూడు రోజులుగా ఆరోగ్య, విద్య, గ్రామ సచివాలయ వ్యవస్థ లపై కార్యసాల నిర్వహిం చామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా, వైద్య , మునిసిపల్, పంచాయతీ రాజ్, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

బేబీ కిట్లకు ఏ టారూ. 51.15 కోట్ల మంజూరు

-2.45 లక్షల మంది శిశువులకు ఉపయోగం -ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువుల కోసం -ఒక్కొక్క కిట్టు ధర రూ. 1,400.22 -మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *