Breaking News

అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టలేరు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసిన ప్రజలను మభ్యపెట్టలేరు అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 79 సచివాలయం పరిధిలో నాయకులు, వాలంటీర్లు, సచివాలయం సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తున్నారు అని, కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. ఈ 17వ డివిజన్ లో ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకులు సంక్షేమ పథకాలు అందుకొన్నారని, నాడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మాకు సంక్షేమ పథకాలు అందలేదు కానీ నేడు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక నేరుగా ఇంటికే తెచ్చి ఇస్తున్నారు అని అంటున్నారు అని ఇది మా ప్రభుత్వ పనితీరు కు నిదర్శనం అని అన్నారు. చంద్రబాబు నాయుడు తన ప్రచార పిచ్చితో, చిన్న సందులలో మీటింగ్ పెడితే జనం బాగా కనిపిస్తారు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవచ్చు అని 8 మంది చావుకు కారణమయ్యారని, వారి తప్పును కప్పిపుచ్చుకునేందుకు నేడు ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. మీ పార్టీ మీటింగ్ లో మీ పార్టీ కార్యకర్తలు చనిపోతే మానవత దృక్పథంతో జగన్ గారు స్పందించి వారి కుటుంబాలకు అండగా ఆర్థిక సహాయం అందించారని గుర్తు పెట్టుకోవాలి అని అన్నారు. మీ రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఇలా ప్రక్క పార్టీ కార్యకర్తలకు సహాయం చేసారా అని ప్రశ్నించారు. ఇదేమి ఖర్మ అంటూ చంద్రబాబు తిరుగుతుంటే, చంద్రబాబు కి ఇదేమి ఖర్మ అంటూ ప్రజలు అనుకుంటున్నారని అవినాష్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి,నాగవంశ కార్పొరేషన్ డైరక్టర్ ఎర్నేటి సుజాత వైసిపి నాయకులు కాశీ,తాజుద్దీన్, వెంకటేశ్వరావు, తిరుపతిరెడ్డి, సుధాకర్,దామోదర్,గీతా కుమారి,జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *