తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రవాణా శాఖ ఆదేశాల మేరకు జిల్లా లోని అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు మరియు రిఫ్లెక్టివ్ టేప్ లు తప్పనిసరి చేయడమైనదని జిల్లా రవాణా శాఖ అధికారి సీతారామి రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహనదారులు అందరు aprtacitizen.epragathi.org వెబ్సైట్ నందు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ఏర్పాటుకు ( HSRP) స్లాట్ నమోదు చేసుకున్న యెడల, తదుపరి సమాచారం సంబంధిత వ్యక్తులకు సంక్షిప్త సందేశం ద్వారా తెలియచేయ బడుతుందని, ఇప్పటి వరకు HSRP ప్లేట్లు లేని వారందరు కూడా వారి వాహనాలకు పాత వాహనాలతో సహా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ప్రతి వాహనానికి రిఫ్లెక్టీవ్ టేప్ లు కూడా తప్పనిసరి చేయడమైనదని వారు ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News