Breaking News

గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చే సమస్యల పరిష్కారం సత్వరం జరగాలి

-విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఏపీసీపీడీసీఎల్ అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారంపై సుధీర్ఘంగా చర్చించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు వచ్చిన సమస్యలపై శనివారానికి యాక్షన్ టేకెన్ రిపోర్ట్(ATR) సమర్పించాలని ఆదేశించారు. నియోజకవర్గంలో ఎక్కడా పవర్ ఓవర్ లోడ్ సమస్య తలెత్తకూడదని సూచించారు. ఇళ్లల్లోకి, మురుగు కాల్వలలో ఉన్న విద్యుత్ స్తంభాలను తక్షణమే తొలగించాలని పేర్కొన్నారు. అనంతరం సబ్ స్టేషన్ల నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు. ఉడాకాలనీ, శ్రీనగర్ కాలనీ, ట్రెండ్ సెట్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలోని సబ్ స్టేషన్ నిర్మాణాన్ని సైతం వీలైనంత త్వరగా పూర్తి చేయవలసిందిగా మల్లాది విష్ణు ఆదేశించారు. స్టేడియం సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ పోల్స్ కు బదులుగా టవర్స్ ను ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. అలాగే ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డులలో ఓవర్ హెడ్ కేబుల్స్ ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేయవలసిందిగా తెలిపారు. అనంతరం లైన్ మెన్ దివాస్ ను పురస్కరించుకుని.. L.I. సుందర్ రావు సహా పలువురు లైన్ మెన్లను ఎమ్మెల్యే చేతులమీదుగా ఘనంగా సత్కరించారు. సమీక్షలో ఏపీసీపీడీసీఎల్ విజయవాడ టౌన్ ఈఈ బి.వి.సుధాకర్, డీఈలు రవిచంద్ర, నాగసాయి, బాలాజీ, ఏఈలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *