విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ ఆదేశాల మేరకు శనివారం 8వ రోజు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ డివిజన్లోని గాంధీనగర్ రాజ్ యువరాజ్ సెంటర్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సమస్యలు ఏమున్నాయని అడిగి తెలుసుకుని, గాంధీనగర్ సచివాలయం సిబ్బందితో, విఎంసి శ్రీధర్ సిబ్బందితో మాట్లాడి తన దృష్టికి వచ్చిన సమస్యను సాయంత్రంలోగా పరిష్కరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా బాలి గోవింద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహకారంతో డివిజన్లోని అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 36వ డివిజన్ ప్రెసిడెంట్ పూలపా కృష్ణ, 27వ డివిజన్ ప్రెసిడెంట్ కురిటి శివ, 36వ డివిజన్ గృహ సారథులు, కన్వీనర్లు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News