Breaking News

సంక్షేమ వసతి గృహాలు, హాస్టల్స్ ను తనిఖీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం సంక్షేమ వసతి గృహాలు, హాస్టల్స్ ను తనిఖీ చెయ్యడం జరుగుతోందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి పేర్కొన్నారు. మంగళవారం న్యాయ సేవా సదన్ ప్రాంగణంలో పారా లీగల్ వాలంటీర్ లతో సమావేశం నిర్వహించారు. అనంతరం నగరంలోని వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ, పారా లీగల్ వాలంటీర్లు కక్షిదారులకు మరియు న్యాయ సేవాధికార సంస్థకు మధ్య వారధిలా వ్యవహరించి తమ ప్రాంతంలో వున్న న్యాయ పరమయిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. వాటి వివరాలను న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి ఎప్పటి కప్పుడు తీసుకురావాలని తెలియచేశారు. న్యాయ విజ్ఞాన సదస్సులలో పాల్గొని ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. మంగళవారం పట్టణంలోని పలు సంక్షేమ వసతి గృహాలను సందర్శించారు. మొదట స్థానిక ఆర్ట్స్ కళాశాల నందు గల గిరిజన బాలుర వసతి గృహాన్ని సందర్శించి అక్కడ వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్ధులతో ముఖా ముఖి గా వారికి వసతి గృహంలో ఎలాంటి సమస్యలున్నా తెలియజేయాలని ప్రత్యూష కుమారీ అన్నారు. వారికి మంచి పౌష్టికాహారాన్ని అందించాలని, వారికి అందించాల్సిన సౌకర్యాలలో ఎటువంటి లోటు పాట్లు ఉండకూడదని వసతి గృహ సిబ్బందికి సూచించారు. తరువాత ప్రభుత్వ బీసి బాలుర వసతి గృహాన్ని సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ సమయానికి మంచి ఆహారాన్ని అందించాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు. అక్కడి పిల్లలతో కాసేపు మాట్లాడారు. అనారోగ్యాల బారిన పడకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. వసతి గృహం విషయంలో ఎలాంటి సమస్యలున్నా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకుని రావలసి చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *