Breaking News

ప్రజా మద్దతుతో తూర్పు లో ఎగిరెది వైసీపీ జెండానే : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలతో పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది అని, ప్రజా మద్దతుతో రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో, తూర్పు నియోజకవర్గంలో ఎగిరెది వైసీపీ జెండానే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 5వ డివిజన్,15 వ సచివాలయం,గంగిరెద్దుల దిబ్బ కొండ చివర అంచు ప్రాంతంలో నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్ లతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల క్యాలెండర్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి పేదవాడికి లబ్ది చేకూరేలా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ప్రజలలో రోజురోజుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ వారి రాజకీయ లబ్ది కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని విమర్శించారు. వారు జనాల దగ్గరకు వచ్చి డ్రామాలు చేస్తూ వైసీపీ కి ఓటు వెయ్యొద్దు అని దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారని ఎద్దేవా చేసారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు ఎప్పుడైనా ఈ కొండప్రాంత వాసుల కష్టాలు పట్టించుకొన్నార, అసలు వారి సమస్యలు తెలుసా అని ప్రశ్నించారు. కానీ నేడు వైసీపీ ప్రభుత్వం లో వారి కష్టాలు తీర్చేలా మౌలిక సదుపాయాలు కల్పించారు. వారికి ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్ చుట్టూ తిరగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అని, కోటి రూపాయల నిధులతో అర్బన్ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేశారని అన్నారు.అదేవిధంగా మంచినీటి సమస్య పరిష్కారానికి నూతన ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబెడ్కర్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,వైస్సార్సీపి నాయకులు మట్టా ప్రసాద్, రామస్వామి,లామ్ కిరణ్,బలస్వామి,అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *