కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు కుల, మతాలకు అతీతంగా అందరిలో సోదరభావాన్నిపెంపొందిస్తాయని రాష్ట్ర హోం మంత్రి, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు టౌన్ ఇందిరమ్మ కాలనీలోని మర్కస్ మసీదులో సోమవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులకు స్వీట్లు పంచారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో హోంమంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. నెలవంక చూసినప్పటినుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపట్టి, అల్లా కృపకు పాత్రులవుతారన్నారు. ఈ మాసంలో ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్ష చేపట్టడం గొప్ప విషయమన్నారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలని ఆమె సూచించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమం అందిస్తూ సర్వ మతాలను సమానంగా చూస్తున్నారని తెలిపారు. ఉర్దూకు రాష్ట్ర రెండో అధికారిక భాష హోదా కల్పించడంతో పాటు రాజకీయంగా ముస్లింలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం మనదేనని మంత్రి తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 4 % రిజర్వేషన్ తో ముస్లింలను ఉన్నత స్థానాల్లో తీసుకెళ్లారని, ఆయన వారసుడు సీఎం జగన్ అంతకు మించి సంక్షేమాభివృద్ధిని అందిస్తున్నారని తెలిపారు. కొవ్వూరు పట్టణంలో షాధిఖానా నిర్మాణానికి నిధులు సమకూర్చి త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తానేటి వనిత హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముస్లిం పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News