Breaking News

ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని హౌసింగ్, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులను నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. మంగళవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో ఇంజినీరింగ్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎమినిటి కార్యదర్శులతో జగనన్నకాలనీల్లో ఇళ్ళ నిర్మాణ పనుల పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత లే అవుట్స్ వారిగా ఇళ్ళ నిర్మాణం ఏ మేరకు పూర్తి అయింది, గ్రౌండ్ లెవల్ ఎన్ని ఉన్నది, మౌలిక వసతులు, బిల్స్ చెల్లింపు, ఇసుక, సిమెంట్, ఇనుము లభ్యత తదితర అంశాలను అధికారులను, ఏమినిటి కార్యదర్శులను అడిగి తెల్సుకొని, మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణపనులు వేగంగా జరగాలని, నిర్మాణ పనుల కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్లు అవసరమైన కార్మికులను సిద్దం చేసుకోవాలన్నారు. ప్రతి లే అవుట్ నుండి కాంట్రాక్టర్ ప్రతి రోజు నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు చేయాలని, నోడల్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. లే అవుట్ ల వారిగా ఎప్పటికప్పుడు పనుల పురోగతి పై నివేదిక ఇవ్వాలని, ఏ సమస్య ఎదురైనా అధికారులు సమన్వయంతో పరిష్కరించి పనుల వేగవంతంకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లే అవుట్ ల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని, లబ్దిదారులు ఇళ్ళ నిర్మాణం చేసుకునేలా సచివాలయ కార్యదర్శులు, నోడల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమావేశంలో నగరపాలక సంస్థ ఎస్.ఈ. భాస్కర్, ఈ.ఈ. సుందర్రామిరెడ్డి, హౌసింగ్ ఈ.ఈ. శంకరరావు, నగరపాలక సంస్థ, హౌసింగ్ డి.ఈ.ఈ.లు, ఏ.ఈ.లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *