Breaking News

భారతరత్న రాజీవ్‌గాంధీకి ఘన నివాళి… : జమీల్‌ అహ్మద్‌ బేగ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అతిచిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, టెలికాం, ఎడ్యుకేషన్‌ రంగాలను ఉన్నత శిఖరాలకు చేర్చిన భారతరత్న రాజీవ్‌గాంధీ వర్ధంతిని కృష్ణాజిల్లా పెనమలూరులో నిర్వహించారు. ఆదివారం పెనమలూరులో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ మాట్లాడుతూ గొప్ప రాజకీయ వారసత్వ నేపథ్యం మరియు దిగ్గజ నేతలతో కూడిన ఉన్నత కుటుంబంలో జన్మించిన రాజీవ్‌ గాంధీ దేశాన్ని కొత్త దిశగా నడిపించారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను స్థాపించి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు స్థానిక స్వపరిపాలన అధికారాలను మంజూరు చేశారు. ఇది పరిపాలన వికేంద్రీకరణకు, స్థానిక సంఘాలకు అధికారాలను ఇచ్చింది. ఐటి, టెలికాం, విద్యారంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారంచుట్టి ప్రపంచంలో దేశానికి ఒక సుస్థిర స్థానాన్ని కల్పించడానికి విశేష కృషి చేశారు.
1984 లో తన తల్లి ఇందిరా గాంధీ మరణానంతరం ఆయన దేశానికి 6 వ ప్రధానిగా సేవలందించారు. బాల్యంలో తన తాత జవహర్‌ లాల్‌ నెహ్రు ప్రధానిగా ఉన్న సమయంలోనే దేశానికి నాయకత్వం వహించడంలో గల లక్షణాలను ఆయన అవపోసన పట్టారు. అయితే తన కుటుంబ నేపథ్యానికి భిన్నంగా ఆయన వేరే వృత్తిని ఎంచుకున్నారు.
1966 లో ఆయన ఇండియన్‌ ఎయిర్‌ల్కెన్స్‌లో పైలెట్‌గా చేరి, ఇటాలియన్‌ అయిన సోనియా గాంధీని పెళ్లాడారు. తన తల్లి మరియు సోదరుడు సంజయ్‌ గాంధీ ఆకస్మిక మరణానంతరం ప్రధాని పదవికి ఆయన ఏకైక వారసుడిగా తెరపైకి వచ్చారు. ప్రధానిగా ఆయన పదవీకాలంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారు. మాల్దీవులలో జరిగిన తిరుగుబాటులో జోక్యం చేసుకోవడం మరియు ఎల్‌టీటీఈకి వ్యతిరేకంగా శ్రీలంకకు శాంతి దళాలను పంపడం వంటి నిర్ణయాలు 1991 లో ఆయన హత్యకు దారి తీశాయన్నారు. దేశం ఒక యువనేతను కోల్పోయిందని జమీల్‌ అహ్మద్‌బేగ్‌ ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీకి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్‌ ఖలీల్‌, మీర్జాబేగ్‌, మహ్మద్‌ రఫీ, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

బేబీ కిట్లకు ఏ టారూ. 51.15 కోట్ల మంజూరు

-2.45 లక్షల మంది శిశువులకు ఉపయోగం -ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువుల కోసం -ఒక్కొక్క కిట్టు ధర రూ. 1,400.22 -మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *