-పర్యావరణ హిత బట్ట బ్యాగులను ప్రోత్సహించాలి: కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణహిత బట్టతో తయారుచేసిన చేతి సంచులు వాడకాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక తిరుపతి రైతు బజార్ నందు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్లాత్ బ్యాగుల వెండింగ్ యంత్రాన్ని ATB (ఎనీ టైం బ్యాగ్) ని కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ నరేంద్రబాబు తో కలిసి ప్రారంభించారు. రైతు బజార్లో కూరగాయల నిత్యావసర సరుకులు కొనుగోలుకు వచ్చే ప్రజలు ప్లాస్టిక్ కవర్లు బ్యాగులు వాడకుండా బట్ట బ్యాగులను వాడేలా, 20 రూపాయల విలువ చేసే బట్ట సంచిని అతి తక్కువ ధరలో కేవలం 10 రూపాయలకే వెండింగ్ యంత్రం ద్వారా కాలుష్య నియంత్రణ మండలి వారు స్వఛ్చాంద్ర ప్రదేశ్ దిశగా పర్యావరణహిత బ్యాగులను అందుబాటులోకి తెచ్చారు అని ఇది మంచి శుభ పరిణామం అని అన్నారు. ఈ యంత్రంలో పది రూపాయల నోటు కానీ, రెండు ఐదు రూపాయల నాణేలు వేయడం ద్వారా బట్ట బ్యాగుల వెండింగ్ యంత్రం ద్వారా బట్ట బ్యాగులను పొందవచ్చు అని తెలిపారు. తొందరలోనే క్యూ ఆర్ కోడ్ ద్వారా కూడా డిజిటల్ పేమెంట్ చేసి కూడా ఈ బ్యాగులను పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ మదన్ మోహన్ మార్కెటింగ్ సహాయ సంచాలకులు సురేంద్ర బాబు, రైతు బజార్ ఎస్టేట్ అధికారి అక్తర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News