-జేసీ తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం, రాజమహేంద్రవరం నందు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ – జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమము శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రం నందు సెప్టెంబర్ 26 మంగళవారం నందు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తముగా గల ఔత్సాహిక రైతులను, నిరుద్యోగులను ప్రోత్సహిస్తూ పశుసంవర్ధకశాఖ తూర్పు గోదావరి జిల్లా వారు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ నిధులతో గ్రామీణ స్థాయిలో పశు పోషణ ద్వారా ఆర్ధిక పురోగతి సాధించుకొనే దిశలో ఈ అవగాహన కార్యక్రమము నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ డా.కె.మాధవీలత వారి ఆదేశాల మేరకు జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జేసీ ఎన్.తేజ్ భరత్ తెలిపారు
ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, ఎల్ డి ఎం, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు, జిల్లాలోని రైతు భరోసా కేంద్రాలలో ఉన్న వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు, ప్రాథమిక గొర్రెలు మరియు మేకల పెంపకందారుల సహకార సంఘ అధ్యక్షులు, 400 మంది ఔ త్సహిక, అభ్యుదయ రైతులు, అందరూ భాగస్వాములవుతారని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా.ఎస్.టి.జి.సత్య గోవింద్ తెలిపారు.
Prajavartha Online Telugu News