విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ 67వ అంతర జిల్లా స్కూల్ గేమ్ప్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల క్రీడాకారులకు ఈ విద్యా సంవత్సరం నుండి సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో తొలిసారిగా రవాణా భత్యాలను సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విడుదల చేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జి. భానుమూర్తిరాజు తెలిపారు. రవాణా భత్యం నిధులు సమగ్ర శిక్ష జిల్లా ఏపీసీల ద్వారా జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీలకు అందిస్తారని తెలిపారు. 13 ఉమ్మడి జిల్లాలకు తొలి విడతగా జిల్లాకు రూ.75 వేలు చొప్పున విడుదల చేశారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి రవాణా భత్యం అందేలా జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీలు చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారులకు కూడా స్పోర్ట్ కిట్స్, రవాణా భత్యం అందిస్తామన్నారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా పోటీ తత్వాన్ని పెంపొందిస్తూ మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో నిధులు విడుదల చేసిన సందర్భంగా జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీలు, వ్యాయామోపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ కి, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు కి అభినందనలు తెలిపారు.
Tags vijayawada
Check Also
పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి
-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …
Prajavartha Online Telugu News