Breaking News

వేద విద్వాన్సులకు జీయర్ పురస్కారాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీతానగరం జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమం నందు జరుగుతున్నటువంటి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారి 67వ తిరు నక్షత్ర వేడుకలలో భాగంగా రెండో రోజు ప్రతి సంవత్సరం వేద విద్వాన్సులకు ఇచ్చేటువంటి జీయర్ పురస్కారాలను ఈ సంవత్సరం, శ్రీమాన్ మోడేకుర్తి సంతోష్ కుమార్ ఆచార్యులు సలక్షణ ఘనాపాటి , మరియు శ్రీమాన్ రావూరి లీలా సుఖ మనోజ్ సలక్షణ ఘనాపాటి వీరి ఇరువురికి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారి చేతుల మీదుగా జీయర్ పురస్కార అవార్డులను శ్రీ స్వామి వారు అందించారు.. అనంతరం వేద పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి వేద విద్యార్థులకు శ్రీ స్వామి వారి చేతుల మీదగా సర్టిఫికెట్లను అందజేశారు.. అనంతరం మైత్రాయిని పద పాటః, ఆదర్శ దినచర్య,మరియు శ్రీ రామానుజుల వారి చరిత్ర హిందీలో ఉన్నటువంటి పుస్తకాలను ఆశ్రమ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు శ్రీ స్వామి వారి చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు.. ఈ కార్యక్రమంలో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారు, క్రేన్ బొక్క పలుకులు అధినేత శ్రీమాన్ గ్రంధి కాంతారావు గారు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *