Breaking News

మనస్సుతో విని మంచి మార్గం చూపించండి..

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో బాలికలు, మహిళలు ఎదుర్కొంటున్న చెప్పుకోలేని సమస్యలను మనస్సుతో విని మంచి పరిష్కార మార్గం చూపించడం ద్వారా ప్రతికూల ఆదోళన విరమించుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు కోరారు. మహిళాల సమస్యల పరిష్కారం కొరకు ఏర్పడిన మనశ్విని కాన్సెప్ట్‌ పోస్టర్‌ను సోమవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు నగరంలోని ఆయన విడిది కార్యాలయం వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌లో నగరపోలీస్‌ కమీషనర్‌ కాంతి రాణా టాటా, జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌లు కలిసి ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మేము మీతో ఉంటాం మీకు సహాయం చేస్తామంటూ మనశ్విని కాన్సెప్ట్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సమాజంలో అనేక మంది మహిళలు పలు సమస్యలతో సతమతమవుతారన్నారు. ఎదురయ్యే సమస్యలు కొన్ని చెప్పుకోలేక, పరిష్కారం దొరకక నిరాశ నిసృహలతో ప్రతికూల ఆలోచనలు చేస్తారన్నారు. బాలికల పై జరుగుతున్న వేధింపులు మహిళాలు పై జరుగుతున్న హింసాత్మాక సంఘాటనలు నివారించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలను చేస్తున్నప్పటికి వాటిని వినియోగించుకోలేక సమస్యలకు పరిష్కారం దొరకక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు చూసున్నామన్నారు. మనశ్విని కాన్సెప్ట్‌ ద్వారా బాలికలు, మహిళలు సమస్యలను మనస్సు పెట్టి విని వారికి మంచి మార్గం చూపడం ద్వారా అనుకూలమైన ఆహ్లాదకర వాతావారణం కల్పించి జీవితం ఆనందమయం చేసేందుకు కృషి చేయాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌ మహిళ కమీషన్‌ మాజీ డైరెక్టర్‌ ఆర్‌. సూయజ్‌ మాట్లాడుతూ మహిళలు బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను మనస్సుతో విని పరిష్కారం మార్గం చూపాలనే ఏకైక లక్ష్యంతో మనశ్విని కాన్సెప్ట్‌ను స్వచ్చందగా ప్రారంభించేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు. లైంకిక వేధింపులు,ఆత్యాచారం, గృహ హింస వంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడే బాలికలు, మహిళలు మనశ్విని దృష్టికి తీసుకువస్తే వారికి పూర్తి సహాయ సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. మనశ్విని కాన్సెప్ట్‌ ద్వారా మహిళాలలో ఆందోళన, సమస్యలు పరిష్కారం, ఆత్మహత్య ధోరణుల నివారణలపై కౌన్సిలింగ్‌, బృంద చర్చలు (గ్రూప్‌ డిస్కర్షన్స్‌), క్షేత్రస్థాయి పర్యాటనలో అవగాహన సదస్సులు, నిర్వహించనున్నామన్నారు. మనశ్వినితో మనస్సు పంచుకునే మహిళల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని నిర్భయంగా ముందుకు వస్తే మేము అండగా ఉండి సహాయం చేస్తామన్నారు. సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఇన్ట్సాగ్రామ్‌ లేదా 9701056808 నెంబర్‌ ద్వారా సంప్రదించాలని ఆమె తెలిపారు.
కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాజెక్టు డైరెక్టర్‌ జి.ఉమాదేవి, పాత ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్‌ ఆఫీసర్‌ మానసిక వైద్యురాలు డా. స్వరాజ్య లక్ష్మి, చేయూత ఎడ్యుకేషన్‌ సెంటర్‌ ప్రిన్సిపల్‌ టి. కృష్ణకుమారి, ప్యాషన్‌నెట్‌ చెంజ్‌ మేకర్‌ ఎ. అనూష, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని యస్‌ నాగమణెమ్మ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *