Breaking News

నిర్మాణ కార్మికుల సంక్షేమ  సెస్  చట్టము ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ భవన ఇతర నిర్మాణాల మీద  1శాతం సెస్ చెల్లించాలి…

-ప్రభుత్వ,  ప్రభుత్వ రంగ సంస్థ సెస్ వివరాలను కార్మిక శాఖకు, బోర్డుకు నివేదికలను 10 రోజుల్లోగా పంపాలి.
-కలెక్టర్ డా. కె. మాధవీలత

రాజమహేందవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అన్ని  ప్రభుత్వ, కేంద్ర మరియు రాష్ట్ర విభాగాలు, సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కాంట్రాక్టర్ల ద్వారా నిర్మాణ పనులను నిర్వహించే స్థానిక అధికారులు, కాంట్రాక్టర్‌లకు చెల్లించే బిల్లుల నుండి ఒకశాతం సెస్‌ను వసూలు చేసి, ప్రతి నెలా నిర్మాణ మండలికి ఆ మొత్తం బదిలీ చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టం, 1996 కింద ఒక శాతం సెస్ వసూలుపై సమన్వయ కమిటీ సమావేశంకు కలెక్టర్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ నిర్మాణ పనులు చేపట్టే ప్రభుత్వ శాఖల, ప్రభుత్వ రంగ సంస్థల  అధికారులు మునిసిపల్ కమీషనర్లు భవన  మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ  సెస్  చట్టము క్రింద ,  ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేట్ భవన మరియు ఇతర నిర్మాణాల మీద  1శాతం సెస్ చెల్లించవలసి ఉన్నదన్నారు.  కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల  నిర్మాణాలకు, నిర్మాణ వ్యయం మీద  1శాతం సెస్ ను ఆయా  శాఖలు, ప్రైవేట్ నిర్మాణాల మీద సెస్ ని ప్లాన్ అప్రూవల్ అథారిటీలైన మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు  ప్లాన్ అప్రూవల్  సమయములో వసూలు చేసి ఆంధ్ర ప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కు జమచేసి  వాటి పూర్తి  వివరాలను, బోర్డుకు కార్మిక శాఖకు నెలవారీ నివేదికను మరియు  యాన్యూవల్  రెటర్న్ లను పంపాలని కోరారు. ఈ  1 శాతం సెస్ ను చట్ట ప్రకారం  వసూలు చేసి బోర్డుకు సక్రమముగా  జమచేస్తున్నారా లేదా నివేదికలు పంపుతున్నారా అన్న విషయముల మీద జిల్లా కలెక్టరు సమీక్ష నిర్వహించారు.   ఈ విషయాలలో ప్రభుత్వ శాఖాధికారులకు పలు సూచనలు  చేసి 1శాతం సెస్ సమర్థవంతంగా వసూలుచేసి బోర్డుకు జమచేయాలని కోరారు. 2014 నుండి ఇప్పటి వరకు చేపట్టిన నిర్మాణ పనుల వివరములు, వసూలుచేసిన సెస్ మొత్తము, జమచేసిన వివరములు తెలుపుతూ నివేదికలను ప్రతి శాఖ మరియు  ప్రభుత్వ రంగ సంస్థ  కార్మిక శాఖకు, బోర్డుకు నివేదికలను 10 రోజుల్లోగా పంపాలని జిల్లా కలెక్టరుగారు ఆదేశించారు.

జిల్లా సమన్వయ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మేరకు ఖచ్చితంగా సేస్ వసూళ్ళు చెయ్యడం తో పాటు జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. సెస్ సేకరణ పురోగతిని పర్యవేక్షించడానికి ఆయా శాఖల జిల్లా అధికారులు వ్యక్తిగత పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టవలసి ఉందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకత్వం మేరకు పర్యవేక్షణలో పనిని నిర్వహించే బాధ్యత అధికారులు చేపట్టాలని స్పష్టం చేశారు. గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ పనులకు అనుగుణంగా సెస్‌ను వసూలు , జమ చెయ్యక పోవడం పై , సరిగ్గా రిజిస్టర్ లు నిర్వహణ చేయడం లేదని, వసూలు చేస్తున్న సెస్‌ను బోర్డుకు పంపడం లేదనే ఆరోపణలు తమ దృష్టికి వొచ్చాయన్నారు. ఇకపై స్థానిక సంస్థల నుంచి చేపట్టే నెలవారీ స్టేట్‌మెంట్‌లు మరియు వార్షిక రిటర్న్ రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు.

సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఎస్పీ పి. జగదీష్, డిఆర్ఓ జి. నరసింహులు, కన్వీనర్ కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బి ఎస్ ఎమ్ వల్లి, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏ.రాణి, కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *