Breaking News

స్పందనకు అందే ఫిర్యాదులను భాధ్యతతో పరిష్కరించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందే ఫిర్యాదులు, అర్జీలు రీ ఓపెన్ అయితే విభాగాదిపతే నేరుగా పరిశీలించాలని నగర అదనపు కమిషనర్ లక్ష్మీ శివజ్యోతి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ కె.లక్ష్మీ శివజ్యోతి స్పందన నిర్వహించారు. అదనపు కమిషనర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి జగనన్నకు చెబుదాం, స్పందనకు అందే ఫిర్యాదులను భాధ్యతతో పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులకు ఇచ్చే ఎండార్స్మెంట్ ను ఆయా విభాగాధిపతులు పరిశీలించాలని, విభాగాల వారిగా జగనన్నకు చెబుదాం అర్జీల పరిష్కారంకై ప్రత్యేక సిబ్బందిని కేటాయించుకోవాలని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు. సమస్య పరిష్కారంకు ముందు, తర్వాత ఫోటోలు జత చేయాలన్నారు. సచివాలయ కార్యదర్శులు విభాగాల వారిగా తమ సచివాలయం పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండాలన్నారు. స్పందన ఆర్జీల అప్ డేట్స్ ని ప్రత్యేకంగా విభాగాధిపతులతో ఏర్పాటు చేసిన గ్రూప్ లో పోస్ట్ చేసి, పరిష్కారాల పై సమీక్షా చేస్తామన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జరిగే స్పందనలో కార్యదర్శులు అందరూ వార్డ్ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. సోమవారం నిర్వహించిన స్పందనలో 31 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 20, ఇంజినీరింగ్ విభాగం 4, రెవెన్యూ విభాగం 3, ప్రజారోగ్య విభాగం 1, ఉపా సెల్ విభాగం సంబంధించి 3 ఫిర్యాదులు అందాయని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీంధ్ర, ఎస్ఈ సుందర్ రామిరెడ్డి, మేనేజర్ శివన్నారాయణ, ఉపా సెల్ సూపరిండెంట్ వెంకటేశ్వర్ల, ఏసిపిలు, ఈఈలు, ఆర్ఓ లు , యస్.యస్ లు, సూపరిండెంట్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *