Breaking News

గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు వేగంగా జరగాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు వేగంగా జరగాలని, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో పనులను పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. గురువారం కమిషనర్ ఏటుకూరు రోడ్ లోని బృందావన్ అపార్ట్మెంట్ నుండి నిర్మాణం జరుగుతున్న డ్రైన్ పనులు, బి.ఆర్.స్టేడియం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను నగరపాలక సంస్థ ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళికాధికారులు, శాప్ అధికారులతో కలిసి పరిశీలించి పనుల వేగవంతంకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో టెండర్ పొందిన కాంట్రాక్టర్ లు పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. బృందావన్ అపార్ట్మెంట్ వద్ద నుండి అవుట్ ఫాల్ డ్రైన్ సుదీర్ఘ కాలం నుండి పెండింగ్ లో ఉండడం వలన పట్నంబజార్ నుండి కబాడీగూడెం వరకు ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్య శాశ్వత పరిష్కారం కోసం బృందావన్ అపార్ట్మెంట్ నుండి కబాడీగూడెం వరకు షుమారు 820 మీటర్ల సిసి స్ట్రాం వాటర్ డ్రైన్ ను రూ.3.53తో నిర్మాణం చేస్తున్నామన్నారు. డ్రైన్ నిర్మాణ ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణల తొలగింపు చేపట్టాలని పట్టణ ప్రణాళిక అధికారులను, నిర్మాణ పనులు వేగంగా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అనంతరం బి.ఆర్.స్టేడియంలో చేపడుతున్న అభివృద్ధి పనులను శాప్ అధికారులను అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన స్టేడియం అభివృద్ధి పనులు నిర్దేశిత గడువు పెట్టుకొని చేయాలని, తూర్పు నియోజకవర్గంలో ప్రజలందరికీ ఉపయోగంగా స్టేడియంని తీర్చిదిద్దాలన్నారు. స్టేడియంకు అవుట్ సైడ్ డ్రైన్ నిర్మాణ పనులు నగరపాలక సంస్థ చేపడుతుందని, శాప్ ఇంజినీరింగ్ అధికారులు స్టేడియంలో వారు నిర్మాణం చేసే డ్రైన్ లెవల్స్ పై నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
పర్యటనలో ఎస్.ఈ.(ఎఫ్ఏసి) సుందర్రామిరెడ్డి, ఈఈ కోటేశ్వరరావు, డిఈఈ శ్రీధర్, డి.ఎస్.డి.ఓ. వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు మీరావలి, ఆబీద్ బాష, వేముల జ్యోతి పద్మజ, ఏ.ఈ. సునీల్ కుమార్, స్థానిక వైసిపి నాయకులు షేక్ నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *