-పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (ఏపీ టెట్ -2024)లో భాగంగా శనివారం నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్ పేపర్ – 2(ఎ) పరీక్షలు సజావుగా జరిగాయని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. మాథమెటిక్స్, సైన్స్ విభాగంలో జరిగిన పరీక్షలో ఉదయం 21,791 మందికి 19065 మంది (87.49%) మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షలో 18,476 మందికి 16,752 మంది (90.67% ) హాజరయ్యారని తెలిపారు. హాల్ టికెట్లలో పేరు తప్పుగా వచ్చిన అభ్యర్థుల వినతి పత్రాలను జిల్లా విద్యా శాఖఅధికారులు క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపించారు. ఈ నివేదికలను ఆధారంగా చేసుకుని అభ్యర్థులకు కొత్త హాల్ టికెట్లు మంజూరు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
Prajavartha Online Telugu News