Breaking News

కళాశాల విద్యార్థినులు భవిష్యత్తుని మలచుకోవాలంటే ఉత్తమమైన మార్గం సరైన అవగాహనతో సరైన కోర్స్ నీ ఎంచుకోవాలి… : Prof హేమ చంద్ర రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టెల్లా కళాశాలలో 62 వ annual డే వేడుకలు ఘనం గ జరిగాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ Dr సిస్టర్ రేఖ కళాశాల లో విద్యార్థినులు, అధ్యాపకులు సాధించిన ప్రగతిని నివేదికలో వెల్లడించారు. ముఖ్య అతిధి గా హేమ చంద్ర రెడ్డి  ఛైర్మన్ AP స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విచ్చేశారు. వారు విద్యార్థినులను కష్ట పడి చదువుకోవాలని ,పోటీ ప్రపంచంలో పాటు తమ కెరీర్ ను మలచుకోవాలి అని, విద్యా రంగంలో ఆంధ్ర ప్రదేశ్ లో స్టూడెంట్స్ కోసం ఎన్నో రిఫార్మ్స్ తీసుకు వస్తున్నామని తెలిపారు. స్టెల్లా కళాశాల 62 సంవత్సరాలుగా యంగ్ గర్ల్స్ నీ స్టెల్లా కళాశాల ఎంపవర్మెంట్ దిశగా అడుగులు వేయిస్తుందనీ కళాశాలను ప్రశంసించారు. విద్యా మాత్రమే కాక పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం పొందుటకు కళాశాల ఎన్నో నూతన కోర్సులు ప్రవేశ పెట్యి చైతన్య వంతులుగా చేస్తున్న కళాశాల గా కళాశాల యాజమాన్యం విద్యార్థినులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుట లో ప్రథమ స్థానం వున్నారని ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అతిథులుగా దాసరి రామకృష్ణ CEO ఎఫ్ట్రనిక్స్ pvt లిమిటెడ్,,Ms వేణి మాధవి ఫౌండర్ వేదిక్ వనాస్ pvt లిమిటెడ్(పూర్వ విద్యార్థిని) విచ్చేశారు. రామ కృష్ణ మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు కల్పించుట ఇండస్ట్రియల్ సెక్టార్ లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయని రామకృష్ణ తెలిపారు. వేణి మాధవి మహిళలు ఆత్మ విశ్వాసంతో నడుచుకోవాలని కళాశాల లో సబ్జెక్ట్ మాత్రం కాక జీవిత పాఠాలు నేర్పుతారు విలువలతో కూడిన విద్యను అందించే ప్రథమ కళాశాల గా కొనియాడారు. కళాశాల కరస్పాండంట్ dr సిస్టర్ లేన క్వాద్రశ శుభాకాంక్షలు తెలిపారు. డిగ్రీ వైస్ ప్రిన్సిపల్ ఉషా కుమారి, dr బ్యూల హిస్టరీ విభాగాధిపతి మరియు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు మేమెంటోలు బహుమతులు అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *