Breaking News

“కళా దీక్షా”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశీయ వారసత్వ సంపదగా నిలిచే భారతీయ సాంప్రదాయ కళలను భావితరాలకు అందించే క్రమంలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయం అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. ఆదివారం కలెక్టర్ విడిది కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ” కళా దీక్షా ” గురువులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నేటి యువత మన జాతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే కళా రీతులను ప్రోత్సహించే విధంగా ఆయా కళా రీతులను నేర్చుకునే ప్రయత్నం చెయ్యడం స్వాగతీయం అన్నారు. ఆక్రమంలో పిల్లలలోని అభిరుచిని గుర్తించి ప్రోత్సాహం అందిస్తున్న గురువులు, తల్లితండ్రులు చొరవను కలెక్టర్ ప్రశంసించారు.

గురు శిష్య పరంపర ను కొనసాగించే ప్రయత్నం లో భాగంగా కళ దీక్ష వార్షిక కార్యక్రమాన్ని పురస్కరించుకుని, ” హరికథ ” ప్రాచుర్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించటానికి నిర్వహిస్తున్న ఏడాది శిక్షణా కార్యక్రమం కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభం చెయ్యడం జరిగిందనీ కూచిపూడి నాట్య గురు కళారత్న డా ఎస్ పి భారతీ తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు గురువులని దుశ్శాలువాతో కలెక్టర్ సన్మానించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి హరికథకు చెందిన శ్రీమతి పురాణం విజయలక్ష్మి, సహా గురు రమాదేవి, కూచిపూడి నాట్యకారిణి డా ఎస్ పి భారతీ, సుదర్శన్ లని సన్మానించి, అనంతరము శిక్షణా తరగతులు హాజరవుతున్న చిన్నారులను కలెక్టర్ మాధవీలత అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

-బేబీ కిట్లకు ఏ టారూ. 51.15 కోట్ల మంజూరు -2.45 లక్షల మంది శిశువులకు ఉపయోగం -ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *