-అంగీకారం తెలియ చేసిన 1306 మంది ఓటర్లు
-కలెక్టర్/డి ఈ వో మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
. జిల్లాలో ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలనే లక్ష్యంతో 85 ఏళ్లు నిండిన, దివ్యంగా ఓటర్లు కు వారీ ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పించడం కోసం 400 మంది ఎన్నికల సిబ్బంది తో కూడిన 69 బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లి నియోజక వర్గాల పరిధిలో 85 ఏళ్లు నిండిన 8294 మంది ఓటర్లు, 40 శాతం దివ్యాంగత్వం కలిగిన 19754 మంది ఓటర్లు ఉండగా, వారికీ ఫారం 12 డి పంపిణీ చేయడం జరిగిందన్నారు. అందులో 85 ప్లస్ కేటగిరిలో 648 , పి డబ్ల్యూ డి కేటగిరిలో 658 మంది ” ఫారం 12 డి” అందజేసినట్లు తెలిపారు. హోం ఓటింగు ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఏడు అసెంబ్లి నియోజక వర్గాల పరిధిలో 69 రూట్స్ ద్వారా ఆయా ఎన్నికల సిబ్బంది తొలి విడతగా మే 2 వ తేదీన, రెండో విడత గా మే 8 వ తేదీన క్షేత్ర స్థాయిలో పర్యటన చేయనున్నట్లు తెలిపారు. ఆమేరకు ఓటర్లు కు ముందస్తుగా సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయా రోజుల్లో ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ మాధవీలత తెలిపారు.
నియోజక వర్గాల వారీగా కేటగిరీ వారీగా ఓటర్లు, బృందాలు వివరాలు
** అనపర్తి 85 ప్లస్ 186 , దివ్యాంగులు 222 హొమ్ ఓటింగు బృందాలు 21 సిబ్బంది 147 మంది.
** రాజానగరం 85 ప్లస్ ఓటర్లు 33 మంది , దివ్యాంగులు ఓటర్లు 67 మంది కోసం హొమ్ ఓటింగు 7 బృందాలు , సిబ్బంది 35 మంది.
** రాజమండ్రీ సీటి లో 85 ప్లస్ ఓటర్లు 142 మంది , దివ్యాంగులు ఓటర్లు 65 మంది కోసం 10 హొమ్ ఓటింగు బృందాలు , సిబ్బంది 40 మంది.
** రాజమండ్రి రూరల్ 85 ప్లస్ ఓటర్లు 51 మంది , దివ్యాంగులు ఓటర్లు 56 మంది కోసం హొమ్ ఓటింగు 5 బృందాలు , సిబ్బంది 30 మంది.
** కొవ్వూరు 85 ప్లస్ ఓటర్లు 66 మంది , దివ్యాంగులు ఓటర్లు 66 మంది కోసం హొమ్ ఓటింగు 8 బృందాలు , సిబ్బంది, 40 మంది.
** నిడదవోలు 85 ప్లస్ ఓటర్లు 130 మంది , దివ్యాంగులు ఓటర్లు 145 మంది కోసం హొమ్ ఓటింగు 12 బృందాలు , సిబ్బంది 72 మంది.
** గోపాలపురం 85 ప్లస్ ఓటర్లు 40 మంది , దివ్యాంగులు ఓటర్లు 37 మంది కోసం హొమ్ ఓటింగు 6 బృందాలు , సిబ్బంది 36 మంది.
Prajavartha Online Telugu News