Breaking News

వైఎస్సార్‌సీపీకి విజయం అందించడానికి తాము సిద్ధం

-‘రోజమ్మను భారీ మెజారిటీతో మళ్ళీ గెలిపిస్తాం!!
-‘నిండ్ర మండలం కోప్పేడు లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి రోజా గారు
-‘మంత్రి రోజమ్మ కు అపూర్వ స్వాగతం

నగరి, నేటి పత్రిక ప్రజావార్త :
నగరి నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అహర్నిశలు కృషి చేసి ఆదర్శంగా నిలిచిన రోజమ్మను భారీ మెజారిటీతో మళ్ళీ గెలిపిస్తామని నిండ్ర మండలం కోప్పేడు పంచాయతీ లోని కోప్పేడు, కోప్పేడు దళితవాడ, వేదంతపురం ఎస్టీ కాలనీ గ్రామాలలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మహిళలు, యువత స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి  ఆర్.కె.రోజా నిండ్ర మండలం కోప్పేడులో వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. మంత్రి రోజమ్మకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలుకగా, యువత జగనన్నకు రోజమ్మ కు జేజేలు పలికి బ్రహ్మరధం పట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, నగరి నియోజకవర్గంలో తాను గత ఐదేళ్ళలో అమలు చేసిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మరోసారి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, నగరిలో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. రాష్ట్ర మంత్రి ఆర్.కె.రోజా నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఎన్నికల ప్రచారంలో ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లు క్రియాశీల సభ్యులు, జే.సి.ఎస్ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కమిటీ చైర్మన్లు, మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *