Breaking News

ఎటువంటి దొమ్మీ లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగం… : ముఖేష్ కుమార్ మీనా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటింగ్ ప్రక్రియ ముగిసే నిర్ణీత సమయానికి కల్లా క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించబడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.  రంపచోడవరం, పాడేరు, అరుకు నియోజకవర్గాల్లో సా. 4.00 గంటలకు మరియు పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సా. 5.00 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ, క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించబడిందన్నారు. అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో సా.6.00 గం. కల్లా క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించబడుతుంది, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎటువంటి దొమ్మీ లేకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుపాను హెచ్చరికలు, భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి

-ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి -అవసరం ఉన్న చోట పునరావాస శిబిరాల నిర్వహణలో పాలుపంచుకోవాలి -పంచాయతీరాజ్, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *